జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడితల గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్రిమి సంహారక మందులు చల్లడంతో చెరువులో సగం పైగా చేపలు మృతి చెందాయి.సుమారుగా లక్ష్య యాబై వెయిల రూపాయలు నష్టం వాటిల్లిందని మత్స్య కారులు అవేదన వ్యక్తం చేశారు. చిట్యాల మండలం ఓడితల గ్రామ చెరువులో చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గంగ పుత్రులు చేపలు పట్టుకోవడానికి మోటార్ సహాయం తో నీరు బయటికి తీసి పెట్టుకుంటుంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మోటార్ ఇక్కడ వాదద్దు అంటూ మమ్మల్ని హెచ్చరించి వెళ్ళిపోయారు.
Also Read : Naga Chaitanya: ఆ డైరెక్టర్ కు ఉన్న కొంచెం పరువును కూడా తీసేసిన చైతన్య
తెల్లవారు జామున చేపలు పట్టుకోవడానికి వెళ్ళేసరికి చేపలు అన్ని చనిపోయి వున్నాయి. క్రిమి సంహారక మందులు చల్లడం వలన్నే సుమారుగా లక్ష్య యాబై వెయిల రూపాయల విలువ చేసే చేపలు చనిపోయాయి అని మత్స్య కారులు అవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై కటిన మైన చర్యలు తీసుకోవాలని మత్స్య కారుల సంగం డిమాండ్ చేసింది.
Also Read : Mark Zuckerberg: మొదటి టోర్నమెంటే.. కానీ బంగారు, రజతాలను గెలిచేశాడు..