Kishan Reddy: హైదరాబాద్ మెట్రో ఫేస్- 2 గురించి తెలంగాణ ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మధ్యనే డిపీఆర్ కేంద్రానికి వచ్చింది.. మెట్రోపై అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉంది.. మెట్రో గురించి కాంగ్రెస్ సర్కార్ ఇంకా సమాచారం ఇవ్వాల్సి ఉంది.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో శ్రమ్ శక్తి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితి గురించి చర్చించారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంపై చర్చ జరిగింది.
CM Revanth Japan Tour: ఈ మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు గల అత్యంత ముఖ్యమైన మార్గంగా విదేశీ పర్యటనలను చేస్తుండడం మరింత జోరుగా మారింది. రాష్ట్రాలకి విదేశీ పెట్టుబడులను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రులు విదేశాల్లో పర్యటిస్తూ అక్కడి పరిశ్రమలతో, పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం జపాన్ పర్యటన చేపట్టింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా…
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రెండవ దశలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా మేడ్చల్, శామీర్ పేట్ దిశగా సాగే కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సారథ్యంలో సాంకేతిక నిపుణులు, అధికారులు హైదరాబాద్ ప్రజల సౌకర్యవంతమైన ప్రయాణానికి కొత్త మెట్రో మార్గాలను రూపొందించే కసరత్తును ప్రారంభించారు. ప్యారడైజ్ – మేడ్చల్ (23 కి.మీ); జేబీఎస్ – శామీర్…
హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ లో ముందడుగు పడింది. వేగవంతంగా ఓల్డ్ సిటీ మెట్రో రైల్ భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. ఎంజీబీఎస్- చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న 7.5కిలోమీటర్ల మెట్రోమార్గానికి కావాల్సిన ఆస్తుల సేకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.