Rajnath Singh: దేశం దీర్ఘకాలిక ప్రయోజనాలు మా లక్ష్యం.. బీజేపీ.. నాన్ బీజేపీ ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం చూడండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: దేశం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కట్టుబడి ప్రణాళికలు రూపొందించడం మా ప్రభుత్వం లక్ష్యం.. దేశ నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం.. బీజేపీ.. నాన్ బీజేపీ ప్రభుత్వాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి అని సూచించారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. విశాఖలో క్లస్టర్ ప్రవాస్ యోజనలో భాగంగా జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ద్రవ్య లోటుతో ప్రపంచంలో అనేక దేశాలు అతలాకుతలం అవుతుంటే కరెంట్ డెఫ్ షీట్ లేని దేశంగా భారత్ అవిర్భవించింది.. ఖతార్ లో గూఢ చర్యం కేసులో చిక్కుకుని శిక్ష అనుభవిస్తున్న భారత మాజీ నేవీ అధికారులను సురక్షితంగా స్వదేశానికి రప్పించిన దౌత్య నీతి.. ప్రధాని కారణంగా సాధ్యం అయ్యిందన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న వేలాది మంది విద్యార్థులను స్వదేశానికి తెచ్చిన ఘనత బీజీపీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.
Read Also: boAt smartwatch: అమోలెడ్ డిస్ప్లేతో ‘బోట్’ స్మార్ట్‌వాచ్.. బ్యాటరీ లైఫ్ 7 డేస్!
Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
కేవలం రాజకీయాల కోసమే భారతీయ జనతాపార్టీ లేదు, దేశాన్ని ప్రపంచ అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు రాజ్‌నాథ్.. ట్రిపుల్ తలాక్, సివిల్ కామన్ కోడ్, అయోధ్య రామాలయం, ఆర్టికల్ 377 ద్వారా కాశ్మీర్ లో స్వేచ్ఛా వాయువులు లాంటి సాహసోపేత నిర్ణయాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇక, 2027 నాటికి ప్రపంచంలోనే భారత్ మూడో ఆర్ధిక శక్తిగా నిలబడడంలో ఎలాంటి సందేహం లేదన్న ఆయన.. 2047 నాటికి ప్రపంచ ఆర్థిక శక్తిగా అవతరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం అన్నారు. UPI లావాదేవీల్లో భారత్ ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది.. ఎన్నికలు, ప్రభుత్వం ఏర్పాటు కోసం పని చేస్తున్న ప్రభుత్వం బీజేపేది.. రాబోయే ఐదు – ఏడేళ్ల కాలంలో ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు కాబోతున్నాయన్నారు.
Read Also: Gollapalli Surya Rao: టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మాజీ మంత్రి..!
భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ కాదు.. నికార్సైన సెక్యులర్ పార్టీగా ప్రపంచం గుర్తించిందన్నారు రాజ్‌నాథ్.. సౌత్, నార్త్ ఇండియా పేరుతో విభజన కోసం రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.. భాష, ప్రాంతీయ వాదం పేరుతో సమగ్రతకు నష్టం కలిగించే చర్యలు అడ్డుకోవాలని సూచించారు. ఇక, ఆంధ్రప్రదేశ్ లో BJP ఓట్ బ్యాంక్ పెరిగింది.. బీజేపీ ఒకరోజు అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. బీజేపీ ఉత్తరాది పార్టీ గనుక దక్షిణాదిలో పనేంటాని అడుగు తున్నారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలలోనూ మేం అధికారంలో ఉన్నామని తెలిపారు. అనేక రాష్ట్రాలలో సెకండ్ ప్లేస్ బీజేపీదే.. కుటుంబ పాలన, అవినీతికి కాంగ్రెస్ పార్టీ అమ్మ లాంటిదని ఫైర్ అయ్యారు. రఫెల్ విమానాలను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే.. దేశీయ నైపుణ్యంతో అద్భుతమైన ఉత్పత్తిని సాధిస్తున్నాం అన్ని వెల్లడించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
తాజావార్తలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!