boAt Wave Spectra smartwatch Price and Battery: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ‘బోట్’ మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ‘బోట్ వేవ్ స్పెక్ట్రా’ పేరిట దీన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల ‘బోట్ లూనార్ ఎంబ్రేస్’ను రిలీజ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్ ధర సుమారు రూ.3,000గా ఉంటుంది. మెటల్ బాడీ, బ్లూటూత్ కాలింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వేవ్ స్పెక్ట్రా ఇతర ఫీచర్లను ఓసారి చూద్దాం.
బోట్ తన కొత్త స్మార్ట్‌వాచ్ వేవ్ స్పెక్ట్రా ధరను భారతదేశంలో రూ.3,099గా నిర్ణయించింది. మీరు ఈ స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్‌లో రూ.2,999కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, సిల్వర్ రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ మెటల్ బాడీ, అందమైన డిజైన్‌లో ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
వేవ్ స్పెక్ట్రా స్మార్ట్‌వాచ్ 2.04 అంగుళాల హెచ్‌డీ అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. బ్లూటూత్ 5.3తో మీరు నేరుగా కాల్‌లు చేయవచ్చు. గరిష్టంగా 20 కాంటాక్ట్స్ సేవ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ వాయిస్ అసిస్టెంట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది రన్నింగ్ మరియు వాకింగ్ కోసం ఆటోమేటిక్ ట్రాకింగ్‌తో సహా 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. దీని స్క్రీన్ ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో 300 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల పాటు ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటే మాత్రం బ్యాటరీ 3 రోజుల వరకు ఉంటుంది.