Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఆరంభంలో రాజాసాబ్తో ఫ్లాప్ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇదే ఏడాదిలో సాలిడ్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. . సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా నుండి ఇటీవల ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సరికొత్త హంగామా మొదలుపెట్టారు.
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’కి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం మేకర్స్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగానే ఫ్యాన్స్ #GiveUsFauziUpdateASAP అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ మరియు ప్రమోషనల్ ప్లాన్స్ వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హిట్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ పూర్వం జరిగే ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎలాంటి విరామం లేకుండా శరవేగంగా సాగుతోంది. షూటింగ్ అనుకున్న సమయానికి సజావుగా సాగుతుండటంతో ఇక సినిమా నుండి ఒక భారీ అప్డేట్ ఇచ్చేందుకు ఇదే సరైన సమయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ఈ రేంజ్ లో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.
Also Read
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
తాజావార్తలు
-
Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు