Site icon NTV Telugu

Bandi Sanjay: కవిత రాసిన లేఖ ఒక OTT ఫ్యామిలీ డ్రామా.. టైటిల్ “కాంగ్రెస్ వదిలిన బాణం”

Bandi Sanjay

Bandi Sanjay

“లెటర్ టూ డాడి” అని కవిత రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దాని టైటిల్ కాంగ్రెస్ వదిలిన బాణమని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ రెండు పార్టీలు విఫలం అయ్యాయన్నారు. అందుకే అవి రెండు కలిసి బిజెపిని బద్నాం చేసే కుట్రలకు తెరలేపాయని.. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం..అది గాంధీల కుటుంబం అయిన కల్వకుంట్ల కుటుంబం అయిన అని స్పష్టం చేశారు. వారి కుటుంబ సంక్షోభాలను గొడవలను ప్రజల భావోద్వేగాలుగా మలుస్తాయని పేర్కొన్నారు.. బీజేపీ ఎవరిని జైలుకు పంపదని స్పష్టం చేశారు. చట్టం ముందు దోషులని తేలితే వారు జైలుకు వెళుతారన్నారు.. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని.. ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

READ MORE: India Pakistan: ‘‘ మా నీరు ఆపితే, మీ గొంతు కోసి చంపేస్తాం’’.. ఉగ్రవాదిలా పాక్ ఆర్మీ అధికారి బెదిరింపులు..

కాగా.. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీపై కేసీఆర్‌ పరిమితంగా మాట్లాడటంతో భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారన్న ఊహాగానాలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎల్కతుర్తి సభ అనంతరం అధినేత కేసీఆర్‌కు కవిత రాసినట్టుగా ఓ లేఖ బయటికొచ్చింది. గతంలో కవిత రాసిన లేఖల్లో ఉన్న దస్తూరితో.. ఈ లేఖలోని దస్తూరీ సరిపోలుతోంది. సభ విజయవంతమైనందుకు కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ లేఖ రాసిన కవిత.. పాజిటివ్‌, నెగిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ పేరిట 8 అంశాలను ప్రస్తావించారు. ఈ లేఖపై తాజాగా బండి సంజయ్ స్పందిస్తూ.. ఓ ట్వీట్ చేశారు.

READ MORE: Adinarayana Reddy: బీజేపీ ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌.. లిక్కర్‌ స్కాం కేసులో మాజీ సీఎం జైలుకే..!

Exit mobile version