Bandi Sanjay: కవిత రాసిన లేఖ ఒక OTT ఫ్యామిలీ డ్రామా.. టైటిల్ “కాంగ్రెస్ వదిలిన బాణం”
- తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ రెండు పార్టీలు విఫలం అయ్యాయి
- అందుకే అవి రెండు కలిసి బిజెపిని బద్నాం చేసే కుట్రలకు తెరలేపాయి
- కుటుంబ పాలనకు బీజేపీ పూర్తి వ్యతిరేకం...
- అది గాంధీల కుటుంబం అయిన.. కల్వకుంట్ల కుటుంబం అయినా
- కవిత లేఖపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“లెటర్ టూ డాడి” అని కవిత రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దాని టైటిల్ కాంగ్రెస్ వదిలిన బాణమని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ రెండు పార్టీలు విఫలం అయ్యాయన్నారు. అందుకే అవి రెండు కలిసి బిజెపిని బద్నాం చేసే కుట్రలకు తెరలేపాయని.. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం..అది గాంధీల కుటుంబం అయిన కల్వకుంట్ల కుటుంబం అయిన అని స్పష్టం చేశారు. వారి కుటుంబ సంక్షోభాలను గొడవలను ప్రజల భావోద్వేగాలుగా మలుస్తాయని పేర్కొన్నారు.. బీజేపీ ఎవరిని జైలుకు పంపదని స్పష్టం చేశారు. చట్టం ముందు దోషులని తేలితే వారు జైలుకు వెళుతారన్నారు.. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని.. ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Also Read
- Nifty 50: రికవరీ దిశలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 25,000 మార్క్‌ను దాటుతుందా..?
- Vaibhav Vs Jaiswal: వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫ్లాప్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
- Marco Rubio: భార్యతో కలిసి తాజ్‌మహల్, జైపూర్ ప్రసిద్ధ కట్టడాలు సందర్శించిన మార్కో రూబియో
- Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్‌పై సోషల్ మీడియాలో చర్చ..
కాగా.. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీపై కేసీఆర్ పరిమితంగా మాట్లాడటంతో భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారన్న ఊహాగానాలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎల్కతుర్తి సభ అనంతరం అధినేత కేసీఆర్‌కు కవిత రాసినట్టుగా ఓ లేఖ బయటికొచ్చింది. గతంలో కవిత రాసిన లేఖల్లో ఉన్న దస్తూరితో.. ఈ లేఖలోని దస్తూరీ సరిపోలుతోంది. సభ విజయవంతమైనందుకు కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ లేఖ రాసిన కవిత.. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ పేరిట 8 అంశాలను ప్రస్తావించారు. ఈ లేఖపై తాజాగా బండి సంజయ్ స్పందిస్తూ.. ఓ ట్వీట్ చేశారు.
READ MORE: Adinarayana Reddy: బీజేపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్.. లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం జైలుకే..!
Letter to ‘Daddy’ might make for an OTT family drama – titled “కాంగ్రెస్ వదిలిన బాణం”
Congress & BRS failed Telangana – now they are crying together blaming BJP.
BJP has always stood against family rule – whether it’s Gandhis or Kalvakuntlas. Family parties try to turn their…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 23, 2025
తాజావార్తలు
-
Nifty 50: రికవరీ దిశలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 25,000 మార్క్‌ను దాటుతుందా..?
-
Water Tank Cleaning : వాటర్ ట్యాంక్‌లో చేపల వాసన వస్తోందా? ఈ ట్రిక్ ట్రై చేయండి.!
-
Peddi : ‘పెద్ది’ ఐటం సాంగ్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది
-
ASUS VM441 AiO: ఆసుస్ నుంచి కొత్త AI డెస్క్‌టాప్.. ఆసుస్ VM441 AiO భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Family Planning : ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఈ టెస్టులు మస్ట్!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?