Bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో “సైకిళ్ల పంపిణీ” కార్యక్రమం నిర్వహించబడింది. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తిని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ సైకిళ్లు మోదీ ఇస్తున్న గిఫ్ట్ అన్నారు. విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్న మోదీ సర్కార్ కు ఇది చిన్న ఉదాహరణ…