Google Pixel 10: గూగుల్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్ అయిన Pixel 10 సిరీస్‌ను ఆగస్టు 20న “Made by Google” ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది. ఈ సిరీస్‌లో Pixel 10, Pixel 10 Pro, Pixel 10 Pro XL, Pixel 10 Pro Fold వంటి వేరియంట్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే లీకైన సమాచారం ప్రకారం.. ఈ సిరీస్‌కు సంబంధించిన ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి.
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ ఫోన్లలో గూగుల్ తయారు చేసిన తాజా Tensor G5 చిప్‌సెట్ ఉండనుంది. అన్ని మోడల్స్‌లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుందని అంచనా. అలాగే కెమెరా సెటప్ విషయానికొస్తే.. Pixel 10 బేస్ వేరియంట్‌లో 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్, 11MP టెలిఫోటో, 12MP సెల్ఫీ కెమెరా ఉంటాయని సమాచారం. మిగతా Pixel 10 Pro, Pro XL మోడల్స్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్, టెలిఫోటో లేదా టెలీ-మాక్రో, 42MP సెల్ఫీ కెమెరా, ఇంకా మెరుగైన ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండే అవకాశం ఉంది.
Read Also:Supreme Court: భార్య వివాహేతర బంధం పెట్టుకుంటే కేసులే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ఇక డిస్ప్లే విషయానికి వస్తే.. Pixel 10లో 6.3 అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంటుంది. Pixel 10 Pro Fold మోడల్‌లో 6.4 అంగుళాల కవర్ డిస్ప్లే, 8 అంగుళాల ప్రధాన ఫోల్డబుల్ డిస్ప్లే ఉంటుందని అంచనా. Pixel 10 Pro, Pro XL మోడల్స్‌లో 480Hz PWM డిమ్మింగ్ ఉన్న ప్రీమియం డిస్‌ప్లే లభించనుంది. అలాగే బ్యాటరీ సామర్థ్యంగా చూస్తే, Pixel 10లో 4,700mAh, Pixel 10 Proలో 4,870mAh, Pixel 10 Pro Foldలో 5,015mAh బ్యాటరీ ఉండనుంది.
ఇతర ప్రత్యేకతల విషయానికొస్తే.. ఫోన్లలో వేగమైన అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Qi2 వైర్‌లెస్ చార్జింగ్, Wi-Fi 6E, PixelSnap మాగ్నెటిక్ యాక్సెసరీస్ వంటి ఫీచర్లు అందించనున్నారు. Pro మోడల్స్‌లో అదనంగా వేపర్ చాంబర్ కూలింగ్, Wi-Fi 7, Ultra-res Zoom, UWB కనెక్టివిటీ, ఇంకా Thread IoT సపోర్ట్ లభించనున్నాయి. ఇక రంగుల విషయానికొస్తే.. Pixel 10 మోడల్ అల్ట్రా బ్లూ, లీమన్ సెల్లో (యెల్లో), ఐరిస్ (పర్పుల్), మిడ్ నైట్ (బ్లాక్ ) రంగుల్లో లభించనుంది. Pixel 10 Pro, Pro XL మోడల్స్ స్టెర్లింగ్ గ్రే, లైట్ పోర్సలీన్ (వైట్), మిడ్ నైట్, స్మోకీ గ్రీన్ రంగుల్లో రానుండగా.. Pixel 10 Pro Fold మోడల్ మాత్రం స్టెర్లింగ్ గ్రే, స్మోకీ గ్రీన్ రంగుల్లో మాత్రమే విడుదల కానుంది.
Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా పవన్ తో ఒక్క సినిమా చేసినా ఒకటే!
Google Pixel 10 ధరల విషయానికి వస్తే.. Pixel 10 ధర 899 నుంచి 999 యూరోస్ (సుమారు 81,000 – 90,000) ఉండే అవకాశం ఉంది. Pixel 10 Pro ధర 1,099 నుంచి 1,589 యూరోస్ (99,000 – 1,44,000) మధ్యగా ఉండొచ్చు. అదే విధంగా, Pixel 10 Pro XL ధర 1,299 – 1,689 యూరోస్ (1,17,000 – 1,54,000) ఉండే అవకాశం ఉంది. ఫోల్డబుల్ మోడల్ అయిన Pixel 10 Pro Fold ధర 1,899 నుంచి 2,289 యూరోస్ (1,71,000 – 2,06,000) వరకు ఉండొచ్చు. మొత్తానికి, Pixel 10 సిరీస్ గూగుల్ నుంచి వస్తున్న అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ లలో ఒకటిగా నిలవనుంది. ఈ ఫోన్లు ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ఫీచర్లు, తాజా ఆండ్రాయిడ్ అనుభవంతో వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.