Uber Shikara Ride: యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్ ఉబెర్ భారతదేశంలో తన మొదటి జల రవాణా సేవను మొదలు పెట్టింది. ఇప్పుడు మీరు కాశ్మీర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో షికారా రైడ్‌ని ఆస్వాదించాలనుకుంటే, మీరు ఉబర్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోగలరు. కాబట్టి ఇప్పటినుండి మీరు కాశ్మీర్‌ను సందర్శించబోతున్నారంటే మీ సరదా రెట్టింపు కాబోతుంది. భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆసియాలోనే తొలిసారిగా ఇలాంటి సర్వీస్‌ను ప్రారంభించినట్లు ఉబెర్ తెలిపింది. ఇక నుంచి శ్రీనగర్‌ను సందర్శించే పర్యాటకులు ఇక్కడ టాక్సీని బుక్ చేసుకోవడంతోపాటు షికారాకు ట్రిప్‌ను బుక్ చేసుకోవడం సులభం అవుతుంది.
Also Read: Under 19 Asia Cup: భారీ తేడాతో జపాన్ ను చిత్తు చేసిన టీమిండియా కుర్రాళ్లు
ఉబర్ మొదలు పెట్టిన ‘షికారా’ బుకింగ్ సేవ గురించి కంపెనీ దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభజీత్ సింగ్ మాట్లాడుతూ.. ఉబెర్ ‘షికారా’ సేవ అనేది నిజానికి సంప్రదాయం, సాంకేతికతల ఏకైక సంగమం అని అన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ‘షికారా’ రైడ్ కోసం సులభంగా బుక్ చేసుకోవచ్చని, కశ్మీర్ టూరిజంను పెంచడంతో పాటు తమ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సర్వీస్‌ను ప్రారంభించడం ద్వారా ప్రయాణికులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించబోతున్నామని ఆయన అన్నారు. ఆసియాలోనే ఈ తరహా జలరవాణా సర్వీసు ఇదే తొలిసారని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Under 19 Asia Cup: భారీ తేడాతో జపాన్ ను చిత్తు చేసిన టీమిండియా కుర్రాళ్లు
ఇకపోతే, కంపెనీ తన ప్లాట్‌ఫారమ్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ ‘షికారా’ను ఆన్‌బోర్డ్ చేసింది. దీనితో వినియోగదారులు ఉబర్ యాప్‌లో షికారా బోట్ యొక్క చిహ్నాన్ని చూస్తారు. వారు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు షికారా రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. దీని కోసం ఉబెర్ షికారా రైడర్స్ నుండి ఎటువంటి కమీషన్ వసూలు చేయదని, మొత్తం మొత్తాన్ని ‘షికారా’ యజమానికి బదిలీ చేస్తామని కంపెనీ తెలిపింది. షికారా రైడ్‌లను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒకేసారి ఒక గంట పాటు బుక్ చేసుకోవచ్చని ఉబెర్ తెలిపింది. ఈ షికారా దాల్ సరస్సులోని షికారా ఘాట్ నంబర్ 16 నుండి మొదలవుతుంది. ఇందులో ఒకేసారి 4 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఉబర్ షికారా రైడ్‌ను 15 రోజుల నుండి 12 గంటల ముందుగానే బుక్ చేసుకోనే అవకాశాన్ని కల్పించారు.