Under 19 Asia Cup: పురుషుల అండర్-19 ఆసియా కప్ 2024లో భారత జట్టు పాకిస్థాన్‌పై భారత్ 43 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చుసిన తర్వాత, జపాన్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 211 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జపాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు జపాన్‌కు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో జపాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 211 పరుగులతో విజయాన్ని అందుకుంది.
Also Read: Rohit Sharma: ఆస్ట్రేలియాలో టీమిండియా కెప్టెన్ మొదటి సెంచరీ చేస్తాడా? రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 భారీ స్కోరు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కెప్టెన్ మహ్మద్ అమన్ అజేయ సెంచరీ సాధించగా.. కేపీ కార్తికేయ 57 పరుగులు, ఆయుష్ మ్హత్రే 54 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇక భారీ లక్ష్య చేధనకు వచ్చిన జపాన్ ఎక్కడ కూడా లక్ష్యం వైపు వెళ్లినట్లు కనపడలేదు. చాలా నెమ్మదిగా ఆడిన జపాన్ నిర్ణిత 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి కేవలం 128 పరుగులకే పరిమితం అయ్యింది. దీనితో భారత్ 211 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.