IND vs BAN: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నేడు అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. దాంతో బంగ్లాదేశ్ భారత్‌కు 199 పరుగుల లక్ష్యాన్ని అందించింది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 49.1 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ తరఫున మహ్మద్ రిజాన్ అత్యధికంగా 47 పరుగులు చేశాడు.
Also Read: Siva Prasad Reddy: మెగా పేరెంట్స్ డే ప్రచారానికి తప్ప.. ప్రయోజనం ఏమైనా ఉందా?
మహ్మద్ శిబాబ్ 40 పరుగులు, మహ్మద్ ఫరీద్ 39 పరుగులు చేశారు. అలాగే జవాద్ అబ్రార్ 20 పరుగులు, అజీజుల్ హకీమ్ తమీమ్ 16 పరుగులు చేశారు. మరో ఐదుగురు ఆటగాళ్లు రెండంకెలకు చేరుకోలేకపోయారు. హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, యుధాజిత్ గుహా చెరో రెండు వికెట్లు తీశారు. 11వ ఎడిషన్ టోర్నీలో మహ్మద్ అమన్ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంకను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. కాగా, డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్ సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. దింతో భారత్ 9వ టైటిల్‌పై కన్నేసింది. ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటికే ఎనిమిది సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఒకసారి ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ ట్రోఫీని గెలుచుకున్నాయి. చూడాలి మరి తక్కువ టార్గెట్ ను టీమిండియా కుర్రాళ్లు ఛేదిస్తారో లేదో .