అండర్-19 ఆసియా కప్ 2024 విజేతగా భారత మహిళా జట్టు నిలిచింది. ఆదివారం కౌలాలంపూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలిచింది. 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 18.3 ఓవర్లలో 76 పరుగులకు ఆలౌట్ అయింది. జువైరియా ఫెర్డోస్ (22) టాప్ స్కోరర్. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో తొలిసారి జరిగిన అండర్-19 ఆసియా కప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇటీవలే అండర్-19 పురుషల ఆసియా కప్ ఫైనల్‌లో…
IND vs BAN: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నేడు అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. దాంతో బంగ్లాదేశ్ భారత్‌కు 199 పరుగుల లక్ష్యాన్ని అందించింది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 49.1 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ తరఫున మహ్మద్ రిజాన్ అత్యధికంగా 47 పరుగులు చేశాడు. Also Read: Siva Prasad Reddy: మెగా…
అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్ మరికొద్దిసేపట్లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆరంభం కానుంది. భారత్, బంగ్లాదేశ్ జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచులో టాస్ గెలిచిన యువ భారత్ కెప్టెన్ మహ్మద్ అమన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గతేడాది సెమీస్‌లో బంగ్లా చేతిలోనే భారత్ ఓడింది. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా కుర్రాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. తుది జట్లు: భారత్: ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రూ సిద్ధార్థ్, మహ్మద్ అమాన్ (కెప్టెన్), కేపీ…
అండర్-19 ఆసియాకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో.. భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
అండర్-19 ఆసియాకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. చేతన్ శర్మ, కిరణ్ చొర్మాలే, ఆయుష్ మాత్రేలు రాణించడంతో శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ యువ జట్టు ముందు 174 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. లంక బ్యాటర్లలో లక్విన్ అబెయ్‌సింఘే (69; 110 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీ చేయగా.. షారుజన్ షణ్ముగనాథన్ (42; 78 బంతుల్లో 2 ఫోర్లు)…
అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం షార్జా క్రికెట్ స్టేడియంలో యూఏఈతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యువ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యూఏఈ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలోనే ఛేదించింది. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (76; 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే (67; 51 బంతుల్లో 4…