మాజీ మంత్రి రోజా భర్త సెల్వమణికి తమిళ నిర్మాతల సంఘం షాక్ ఇచ్చింది. ఫెప్సీపై పలు ఆంక్షలు విధించడంతో, మాకు మద్దతుగా నిలిచిన కార్మికులతో కొత్త యూనియన్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడుగా ఆర్కే. సెల్వమణి ఉన్నారు. గత కొద్దికాలంగా తమిళ నిర్మాతల మండలి వర్సెస్ దక్షిణ భాతర సినీ కార్మికుల సమాఖ్య ( ఫెప్సీ)కి మధ్య వార్ నడుస్తోంది. సభ్యులు కొంత కాలంగా ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు.
Also Read:RRC SECR: టెన్త్ పాసైతే చాలు.. రైల్వేలో 1007 జాబ్స్ రెడీ.. రాత పరీక్ష లేదు..
నిర్మాతల నుంచి కార్మికులకు అందే వేతనాల విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారని ఆర్కే సెల్వమణి పై నిర్మాతల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నిర్మాతలే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారంటూ సేల్వమణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. హీరో ధనుష్.. ఓ నిర్మాణ సంస్థ వివాదం సరైన రీతిలో స్పందించలేదని సెల్వమణిపై ఆరోపణలు వచ్చాయి.