Mohan Babu Case : సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు స్వల్ప ఊరట.. కానీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు మోహన్ బాబు ఇంటి ఆస్తుల గొడవ గురించి అందరికీ తెలిసిందే. గడచిన నెల రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలొ మోహన్ బాబు ఓ రిపోర్టర్ ని మైక్ తో కొట్టడంతో మంచు వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఆ రిపోర్టర్ మోహన్ బాబు పై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కొరగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసాడు మోహన్ బాబు. తాజాగా ఈ కేసు పై సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే నాలుగు వారాలకు కేసు వాయిదా వేసిన సుప్రీంకోర్టు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
అలాగే నష్టపరిహారం కావాలా లేక జైలుకు పంపాలా అని ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తదుపరి విచారణలో జడ్జిమెంట్ ఇస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. అలాగే ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా అని మోహన్ బాబు తరపున వాదన వినిపించిన సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గిను ప్రశ్నించింది ధర్మాసనం. అయితే తన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగింది, జర్నలిస్ట్ పై జరిగిన దాడికి బహిరంగంగా క్షమాపణ చెప్పాను, నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను, 76 ఏళ్ల వయసున్న తాను కావాలని దాడి చేయలేదు, ఆవేశంలో జరిగింది, జర్నలిస్టులు నా ఇంట్లోకి ట్రెస్ పాస్ చేశారు అని కోర్టుకు తెలిపారు మంచు మోహన్ బాబు.
Also Read
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
- Murali Kishor: 'లెనిన్' డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
తాజావార్తలు
-
CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!