Tummala Nageswara Rao : కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాస్వామ్యం గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అంగీకరించడానికి మాత్రం సిద్ధంగా లేరన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును అందరం గౌరవించాలన్నారు. కానీ కేసీఆర్ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి తుమ్మల విమర్శించారు. నాకు ఓటేసినంత కాలం ప్రజలు తెలివైనవారని, నాకు వ్యతిరేకంగా ఓటేస్తే మాత్రం పజలు మూర్ఖులన్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పాలు ఇచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును ఎన్నుకున్నారు అంటూ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవించక పోగా ప్రజలను చులకన చేసి మాట్లాడడం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని తుమ్మల నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. ఇంతటి రాజకీయ అనుభవమున్న కేసీఆర్ ఒక్క ఓటమితోనే ఓటర్ల విజ్ఞతను శంకిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచి ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు.
Mamata Banerjee: రైతులపై టియర్ ప్రయోగించడంపై మమత ఫైర్
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
ప్రతిపక్ష నాయకుడి హోదాకు తగని మాటలని ఆయన అన్నారు. కృష్ణ గోదావరి నదులపై తెలంగాణ వాటాను వదులుకున్నది కేసిఆర్. పదేళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రానికి న్యాయం చేయకపోగా నాశనం చేసిన చరిత్ర మీదని, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో జరిగింది అవినీతి కాక ఏమిటి ? మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగితే కేసీఆర్ కు కనీసం బాధ్యత, బాధ ఉన్నట్లు కనపడకపోవడం విచారకరం. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయితే ఏమి పికనీయ పోయారు అంటూ కేసీఆర్ మాట్లాడడం ఎంత బాధ్యతారాహిత్యం..? అని ఆయన ప్రశ్నించారు. నల్లగొండకు పోయే ఓపికుంది కానీ ఇంటిపక్కనున్న అసెంబ్లీకి మాత్రం రారు. ప్రజలెన్నుకున్న సభలో ప్రజా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబు చెప్పేధైర్యం లేకనే శాసన సభకు రావడం లేదని తుమ్మల వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?