APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టులో తుది విచారణ కొనసాగుతోంది. ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థుల తరఫు న్యాయవాదులు, ఎంపిక ప్రక్రియలో ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉద్యోగాలకు ఎంపికైన 160 మంది అభ్యర్థుల ఓయమ్మార్ స్లిప్పుల్లో దిద్దుబాట్లు, ఓవర్రైటింగ్ ఉన్నాయని వారు వాదించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీ తన విధి నిర్వహణలో అన్ని రకాలుగా విఫలమైందని ఎంపిక కాని అభ్యర్థుల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. హైల్యాండ్‌లో జరిగిన మూల్యాంకనం నిబంధనలకు అనుగుణంగా జరగలేదనే కారణంతోనే విజయవాడలో మరోసారి మూల్యాంకనం చేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఎగ్జామినర్లు చేసిన పొరపాట్లకు అభ్యర్థులను బాధ్యులను చేయడానికి వీల్లేదని ఎంపికైన అభ్యర్థుల తరఫు న్యాయవాదులు వాదించారు. అలాగే అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు సిట్ ఎక్కడా నిర్ధారించలేదని కోర్టుకు వివరించారు. ఈ వ్యవహారంపై ఇరువర్గాల వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టులో విచారణ నేడు కూడా కొనసాగనుంది.
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
తాజావార్తలు
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?