CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైంది ప్రభుత్వం.. విజయవాడలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని 26,401 మంది పేదల ఇళ్లకు శాశ్వత హక్కులతో పట్టాలను అందించనున్నారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్తో పాటు గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులు ఈ పట్టాలను అందుకోనున్నారు. ఈసారి పంపిణీ చేస్తున్న పట్టాలకు ప్రభుత్వ విలువ రూ.11,246 కోట్లుగా ఉండగా, మార్కెట్ విలువ రూ.28,118 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం దాదాపు 707 ఎకరాలు, 34 లక్షల చదరపు గజాల స్థలానికి సంబంధించి పేదలకు శాశ్వత హక్కులు కల్పించనున్నారు.
వేలాది కుటుంబాలకు శాశ్వత హక్కులు
పట్టాలు అందుకుంటున్న వారిలో 10 ఏళ్లు పూర్తయిన 12,710 మంది అసైన్డ్ లబ్ధిదారులు ఉన్నారు. గతంలో లబ్ధిదారుల నుంచి స్థలాలు కొనుగోలు చేసుకుని ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్న మరో 8,746 మందికి కూడా హక్కులు కల్పించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో అనధికారికంగా నివాసం ఉంటున్న 2,586 మందికి ఆయా స్థలాలపై శాశ్వత హక్కులు ఇవ్వనున్నారు. ఇక, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా ఇప్పటికే విశాఖపట్నంలో 28,445 మందికి రూ.8,874 కోట్ల విలువైన పట్టాలను సీఎం చంద్రబాబు అందించారు. మంగళగిరిలో మూడు విడతల్లో 5,800 మందికి రూ.727 కోట్ల విలువైన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
Also Read
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
విజయవాడలో తాజాగా అందిస్తున్న పట్టాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 60,646 పట్టాలను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటి ప్రభుత్వ విలువ రూ.19,401 కోట్లుగా ఉంది. మార్కెట్ విలువ ప్రకారం ఈ పట్టాల మొత్తం విలువ రూ.52,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. పేద కుటుంబాలకు కేవలం నివాస హక్కు మాత్రమే కాకుండా, ఆయా ఇళ్ల స్థలాలపై శాశ్వత హక్కులు కల్పించడం ద్వారా భవిష్యత్తులో వారికి మరింత భద్రత కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటోంది.
తాజావార్తలు
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?