TTD: ‘గోవింద కోటి’ రాసిన వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తాం: టీటీడీ ఈవో ధర్మా రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
25 ఏళ్లు లోపు వారు ‘గోవింద కోటి’ పదిలక్షల నూట పదహారుసార్లు రాసిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కార్యక్రమం చేపట్టామని, భక్తులు నుంచి అద్భుత స్పందన వస్తోందన్నారు. నడక మార్గంలో చిరుత పులులు దాడులు అడ్డకట్టకు 5 కోట్లు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారికి అందించామని టీటీడీ ఈవో చెప్పారు. టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ గ్రౌండ్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీడీ ఈవో జాతీయ జెండా ఆవిష్కరించగా.. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
టీటీడీ ఈవో ధర్మా రెడ్డి మాట్లాడుతూ… ‘టీటీడీ తరపున వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు 6 లక్షల 50 వేల మంది భక్తులకు దర్శనం చేయించాం. ఫిబ్రవరి 16న రథ సప్తమి వైభవంగా నిర్వహిస్తాం. అయోధ్యలో బాల రాముడు విగ్రహ ప్రతిష్ఠ రోజు లక్ష లడ్డూలు స్వామి వారికి అందించాం. 25 ఏళ్లు లోపు వారు గోవింద కోటి పదిలక్షల నూట పదహారుసార్లు రాసి తీసుకు వచ్చిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తాం. తిరుమలలో ఫిబ్రవరి 3న శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నాం. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కార్యక్రమం చేపట్టాం. భక్తులు నుంచి అద్భుత స్పందన వస్తోంది.. నడక మార్గంలో చిరుత పులులు దాడులు అడ్డకట్టకు 5 కోట్లు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారికి అందించాం. 45 కోట్లు ఖర్చుతో కండలేరు నుంచి 40 టీటీడీ పాలకమండలి ఆమోదం పొందినది. స్వామి వారి అనుగ్రహంతో డిసెంబర్ 6న తిరుమలలో కుండ పోత వర్షం కురిసింది. తిరుమలలో రిజర్వాయర్లు అన్ని నిండాయి. కాషన్ డిపాజిట్ వెనక్కి ఇచ్చే ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చాం’ అని తెలిపారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
1100 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నగదు వచ్చింది. 700 ఆలయాలు పూర్తి అయ్యాయి, మిగిలినవి మార్చిలోపు పూర్తి చేస్తాం. చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు సమయంలో గుళ్లు, గోపురాలు నిర్మాణం చేస్తే.. నేడు సీఎం జగన్ ప్రభుత్వంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3316 ఆలయాలు నిర్మాణం జరుగుతోంది. నాలుగున్నర ఏళ్లలో టీటీడీ ధార్మిక ఆలయాలు, సదస్సులు శ్రీకృష్ణ దేవరాయలు సమయం కంటే ఎక్కువగా ఆలయాలు నిర్మాణం జరిగింది. తిరుపతిలో అచ్యుతం, శ్రీ పథం గెస్ట్ హౌస్‌లు నిర్మాణం చేస్తున్నాం. దీనిద్వారా 25 వేల మందికి వసతి సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. సీఎం జగన్ ప్రారంభించిన శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్ ద్వారా 26 నెలల్లో 2350 గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించాం. మూడు రోజుల చిన్నారికి గుండె ఆపరేషన్ చేసిన చరిత్ర టీటీడీ శ్రీపద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్‌దే. 11 గుండె మార్పిడి ఆపరేషన్స్ చేశాం. ప్రపంచంలోనే ఇంత అద్భుతంగా, వేగంగా గుండె ఆపరేషన్స్ జరిగింది లేదు’ అని టీటీడీ ఈవో పేర్కొన్నారు.
Also Read: IND vs ENG: లంచ్ బ్రేక్.. భారత్ స్కోరు 222/3!
‘సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన చేశారు. 250 కోట్లతో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతోంది. 80 శాతం పూర్తి అయ్యింది, మరో 20 శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో అతీంద్రియ విజ్ఞానం అనే నూతన కోర్సు ప్రారంభించాం. 60 కోట్లతో అత్యాధునిక గోశాల నిర్మాణం చేస్తున్నాం. దాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. 3518 మంది టీటీడీ ఉద్యోగులకు మొదటి విడతలో ఇళ్లు స్థలాలు, రెండో విడత లో 1700 మందికి ఇళ్లు స్థలాలు మంజూరు చేశాం. వెంకటగిరి రోడ్డులో 450 ఎకరాల్లో 5వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేస్తాం. ఫిబ్రవరి నెలాఖరుకు అందిస్తాం’ అని టీటీడీ ఈవో చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!