సందీప్ రాజ్ షో రన్నర్‌గా హర్ష రోషన్, భాను, జయతీర్థ ప్రధాన పాత్రల్లో జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరిస్ AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్. జూలై 3 నుంచి సిరీస్ ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోలు శివాజీ, సుహాస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శివాజీ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. చదువు…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకును అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ వన్ లో టాప్ మార్క్స్ 550గా కమిషన్ నిర్ధారించింది. మహిళా అభ్యర్థి టాప్ వన్‌లో నిలిచింది. 52 మంది 500 కు పైగా మార్క్ లు సాధించారు.
రైల్వేలలో ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కంటున్న యువత కోసం మరో రిక్రూట్‌మెంట్ వచ్చేసింది. ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)కు సంబంధించి 9970 పోస్టులకు నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రైల్వే రిక్రూట్‌మెంట్‌కు అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 9 మే 2025. అప్పటి వరకు అభ్యర్థులు ఈ నియామకానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి.
గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. డిసెంబర్ 2022 లో 1388 పోస్ట్ భర్తీకి గ్రూప్ -3 నోటిఫికేషన్ విడుదలవగా.. 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) పరీక్ష రాశారు. ఫలితాలతో పాటే ఫైనల్ కీ, అభ్యర్థుల లాగిన్ ఐడీలకు OMR షీట్స్ కూడా పంపించారు.…
గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్‌సీ అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించింది. 783 పోస్ట్ ల భర్తీకి 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్షకు 5 లక్షల 51 వేల 855 మంది దరఖాస్తు చేసుకున్నారు. పలుమార్లు వాయిదా పడి గత డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్ష జరిగింది. 2 లక్షల 51 వేల 738 (45.57 శాతం) మంది పరీక్ష రాశారు. పరీక్షకు…
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5న మొదలై.. 24తో ముగుస్తాయి. కాగా.. మార్చి 6 నుంచి మొదలయ్యే ద్వితీయ ఇంటర్ పరీక్షలు 25వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. ఈ ఏడాది దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం ఉంది. పరీక్షలు…
UGC NET 2025 : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ 2024 సెషన్ పరీక్షలు దేశవ్యాప్తంగా పలు కేంద్రాలలో జరుగుతున్నాయి. జనవరి 3న ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 16 వరకు కొనసాగనున్నాయి. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 15న జరగవలసిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్టీయే పేర్కొంది. జనవరి 16న నిర్వహించవలసిన పరీక్ష మాత్రం…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం తన బాధ్యత అని టీజీపీఎస్‌సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 అభ్యర్థులకు కీలకమైన సమాచారాన్ని అందించింది. 2024, అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు 2024, అక్టోబర్ 14 నుండి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, అభ్యర్థులు హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్‌లోడ్ సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే, టోల్…
తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఆ దరఖాస్తు లో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే ఛాన్స్ ఇచ్చింది.