పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించకూడదంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ మాధవి సారథ్యంలోని ధర్మాసనం కొద్దిసేపటి కిందటే ఆదేశాలు వెలువడించింది. తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించకూడదంటూ ఇదివరకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది. 2022లో కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా, సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : VishnuVardhan Reddy: అమరావతి రైతుల ఆవేదనకు చంద్రబాబే కారణం
గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలను ఎక్కడ నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలని తెలిపింది. ఇదిలా ఉంటే.. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రభుత్వం నుంచి తన కార్యాలయానికి ఎలాంటి సమాచారం అందలేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
Also Read : Talasila Raghuram: లోకేష్ ది అనామక పాదయాత్ర