హీట్ వేవ్స్ పై తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది. మార్చి చివరి నుంచి జూన్ వరకు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వైద్యశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. నోడల్ అధికారిని నియమించాలని అధికారులు సూచించారు. హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వాలని, రాపిడ్ రెస్పెన్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మెడిసిన్స్ అందుబాటులో పెట్టాలని సూచించారు. హీట్ వెవ్స్ పై ప్రతి రోజు ఆరోగ్య శాఖ హెల్త్ డైరెక్టర్ కి రిపోర్ట్ చేయాలని, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకొని సరఫరా చేసే నీటిలో ఫ్లోరిన్ శాతాన్ని నమోదు చేయాలని పేర్కొన్నారు. వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
Also Read : Meta Layoffs: ఐటీ ఉద్యోగులకు షాక్.. మరో 10,000 మందిని తొలగిస్తూ మెటా నిర్ణయం..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో రేపటి నుంచి వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవైపు భగభగ మండే ఎండలు మండుతుంటే… మరోవైపు వర్షాలు కురుస్తాయని తీపికబురు చెప్పింది వాతావరణ శాఖ. దీంతో విరుద్ధమైన వాతావరణం నెలకొంటుందని, బుధవారం నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి సోమవారం బలపడింది. ఈ గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నదని తెలిపింది.
Also Read : Goyaz Silver Jewellers: యాంకర్ సుమ చేతులమీదుగా గోయాజ్ జ్యూయలరీ ప్రారంభం