TS Eamcet 2023 : ఎంసెట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు అలర్ట్.. ప్రాథమిక కీ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక కీ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన వివిధ సెంటర్లలో నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం రాత్రి 8గంటలకు ఎంసెట్ 2023 (ఇంజినీరింగ్ స్ట్రీమ్) పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు ఆరు విడతల్లో నిర్వహించిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల రెస్పాన్స్ పత్రాలను సైతం వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ ప్రాథమిక కీపై ఈ నెల 17 రాత్రి 8గంటల వరకు అభ్యంతరాలను పంపొచ్చని అధికారులు సూచించారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు మొత్తం 2,05,351 మంది దరఖాస్తులు చేసుకోగా.. 1,95,275మంది(94.11శాతం) పరీక్షలు రాసినట్టు ఎంసెట్ కన్వీనర్ కార్యాలయం వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఈ నెల 10న మొదలైన ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ఆదివారం ముగిశాయి. శుక్రవారం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షకు 96 శాతం మంది(తెలుగు రాష్ట్రాల) అభ్యర్థులు హాజరైనట్లు ఎంసెట్ కో కన్వీనర్ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో 96.35 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 92.50 శాతం హాజరు నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 97శాతం మంది పరీక్ష రాశారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్.. 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను నిర్వహించారు. అయితే.. అగ్రికల్చర్ ప్రిలిమినరీ కీ ని ఆదివారం అందుబాటులోకి తీసుకొచ్చారు.
Also Read
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
తాజావార్తలు
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!