Trump Warns China: డ్రాగన్ దేశానికి ట్రంప్ వార్నింగ్.. ఇరాన్‌కు సాయం చేస్తే చైనాపై 50% టారిఫ్ విధిస్తామని హెచ్చరిక!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనానికి ఆదేశించిన అధ్యక్షుడు
- అమెరికా నుంచి చమురు కొనుగోలు చేయాలని చైనాకు ప్రతిపాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Warns China: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ, చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు సైనిక సహాయం లేదా ఆయుధాలు సరఫరా చేస్తే చైనా వస్తువులపై 50 శాతం భారీ టారిఫ్ (సుంకం) విధిస్తామని ఆయన తాజాగా హెచ్చరించారు. ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
READ ALSO: RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!
Also Read
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..
ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని ఆయన అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. “అమెరికా నౌకాదళం తక్షణమే హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే లేదా వెలుపలికి వచ్చే నౌకలను అడ్డుకుంటుంది. శాంతియుత నౌకలపై దాడి చేసే ఇరాన్ బలగాలను తుత్తునియలు చేస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు. ఇదే సమయంలో ట్రంప్.. చైనాకు ఆఫర్ ఇచ్చారు. ఇరాన్ నుంచి చమురు కొనడానికి బదులు, అమెరికా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. “చైనా తన నౌకలను వెనిజులాకు పంపవచ్చు. మా వద్ద అపారమైన నిల్వలు ఉన్నాయి. ఇరాన్ కంటే తక్కువ ధరకే మేము చమురును సరఫరా చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ నేతృత్వంలో ఇరాన్ ప్రతినిధులతో జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాలను నిలిపివేయడానికి అంగీకరించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వాన్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చైనాను హెచ్చరిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వచ్చే నెలలో ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
READ ALSO: Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!