CHINA: రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు చైనాపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలను కోరారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేయాలని ఆయన ఓ లేఖలో కోరారు. చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని లేఖలో కోరారు. అన్ని నాటో దేశాలు అంగీకరించి సుంకాలు వేయడానికి సద్ధంగా ఉన్నప్పుడు, తాను రష్యాపై పెద్ద ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.
చైనాపై ట్రంప్ విధించిన సుంకాలను టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్ తీవ్రంగా తప్పుపట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మనసు మార్చుకోవాలని ట్రంప్‌ను మస్క్ కోరినట్లు తెలుస్తోంది.
ఆగ్రరాజ్యం అమెరికా విధించిన సుంకాలకు ధీటుగా చైనా కూడా అంతే ధీటుగా స్పందించింది. తామేమీ తక్కువ కాదని నిరూపించింది. తాము కూడా తగ్గేదేలే అన్నట్టుగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది.