Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moringa Powder: డైటింగ్ చేస్తున్నారా, మీ ఒంట్లో పేరుకుపోయిన మొండి కొవ్వును వదిలించుకోవాలని చూస్తున్నారా, అయితే మీ డైట్ లిస్ట్‌లో ఉండాల్సిన మొదటి ఐటమ్ మునగాకు కారప్పొడి. జిమ్‌లు, వర్కౌట్లు ఒకెత్తయితే.. మనం తినే ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవడం మరో ఎత్తు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ మ్యాజిక్ పొడిని కేవలం పది నిమిషాల్లో ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి. నిజానికి మునగాకులో ఉండే ఔషధ గుణాలు మరే ఇతర ఆకుకూరల్లోనూ ఉండవు. ఇది ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.
READ ALSO: US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..
Also Read
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
దీనికి కావలసిన పదార్థాలు..
శుభ్రం చేసిన మునగాకు (250 గ్రాములు)
కరివేపాకు (ఒక గుప్పెడు)
పచ్చిశెనగపప్పు, మినప్పప్పు (తలో 1 టేబుల్ స్పూన్)
ధనియాలు (1 టేబుల్ స్పూన్), జీలకర్ర (1 టీస్పూన్)
ఎండుమిర్చి (10-15), నువ్వులు (2 టేబుల్ స్పూన్లు)
వెల్లుల్లి రెబ్బలు (8-10), చింతపండు, ఉప్పు, పసుపు, ఇంగువ.
తయారీ విధానం..
ముందుగా మునగాకును పాన్‌లో వేసి చిన్న మంట మీద డ్రైగా, క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. తర్వాత అదే విధంగా కరివేపాకును కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి పప్పులు, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, జీలకర్ర, మెంతులను దోరగా వేయించాలి. చివరగా వెల్లుల్లి, చింతపండు, పసుపు, ఇంగువ వేసి కలిపి చల్లారనివ్వాలి. అనంతరం అన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే ఆరోగ్యకరమైన మునగాకు పొడి రెడీ అవుతుంది.
ప్రయోజనాలు ఇవే..
మునగాకులో క్యారెట్ కంటే ఎక్కువ విటమిన్ A, పాల కంటే ఎక్కువ కాల్షియం, అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇందులో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది గొప్ప ఔషధంగా పని చేస్తుంది. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత (Anemia) తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. విటమిన్ A సమృద్ధిగా ఉండటం వల్ల రేచీకటి వంటి సమస్యలు తగ్గి, కంటి చూపు మెరుగుపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకు పొడిని మీకు టైం ఉన్నప్పుడు మీ ఇంట్లో తయారు చేయడానికి ప్రయత్నించండి మరి.
READ ALSO: Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!