War 2 : ప్రస్తుతం దేవర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఫస్ట్ వీకెండ్‌లో 304 కోట్లు రాబట్టిన దేవర పార్ట్ 1.. మొదటి వారం పూర్తయ్యేసరికి 400 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది. దేవర తర్వాత టైగర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా.. ఎన్టీఆర్ కీలక షెడ్యూల్స్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు మరో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పై పలు కీలక యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు.
Read Also:Pragya Nagra : లీక్ వీడియోలపై స్పందించిన నటి ప్రగ్యా
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ హీరోల టాప్ డ్యాన్సర్ల లిస్ట్ తీస్తే.. ఎన్టీఆర్, హృతిక్ టాప్‌లో ఉంటారు. అలాంటి ఈ ఇద్దరు కలిసి మాస్ సాంగ్ అంటే.. థియేటర్లు తగలబడిపోవడం గ్యారెంటీ. వచ్చే ఏడాది ఆగష్టులో వార్2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. యశ్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
Read Also:Syria-Lebanon: సిరియాలో ఉద్రిక్తత.. 2 వేల యోధులను పంపిన లెబనాన్
‘వార్ 2’ సినిమా పై నార్త్ లోనే కాదు.. సౌత్ లోనూ చాలా ఆసక్తిగా ఉన్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా రికార్డుల జాతర మోగించే అవకాశం ఉంది. దీనికితోడు ‘వార్ 2’ సినిమాకు సంబంధించి వచ్చిన రూమర్స్ అభిమానులు ఫుల్ జోష్ ని నింపుతున్నాయి. ఐతే, వచ్చే షెడ్యూల్ లో ‘వార్ 2’ క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో ‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’లతో పాటు మరో షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.