Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Trump Kharg Island Attack Iran War Oil Hub Demolished

Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

Published Date :March 15, 2026 , 10:27 am
By BV Reddy
  • ఖార్గ్ ద్వీపంపై మరిన్ని దాడులు చేస్తాం..
  • ఇరాన్‌కు బిగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..
Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Trump: ఇరాన్‌కు వ్యూహత్మకంగా, ఆర్థికంగా అతి ముఖ్యమైన ‘‘ఖార్గ్ ద్వీపం’’పై అమెరికా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ దాడులకు తీవ్ర ప్రతీకారం ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే, భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఖార్గ్ ద్వీపంలోని చమురు ఎగుమతి కేంద్రాలపై మరిన్ని దాడులు చేస్తామని చెప్పారు. హార్ముజ్ జలసంధిని సురక్షితం చేయడానికి యుద్ధ నౌకల్ని పంపాలని మిత్రదేశాలను కోరారు.

అమెరికా దాడులు ఖార్గ్ ద్వీపంలోని చాలా భాగాన్ని “పూర్తిగా నాశనం చేశాయి” అని ట్రంప్ అన్నారు మరియు మరిన్ని దాడులు జరగవచ్చని, “మేము సరదా కోసం మరికొన్ని సార్లు దానిపై దాడి చేయవచ్చు” అని ప్రకటించారు. యుద్ధం ముగించడానికి ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పినప్పటికీ, నిబంధనలు ఇంకా సరిపోవు అని ఆయన అన్నారు. ఖార్గ్ ద్వీపంపై దాడి మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతల్ని పెంచాయి. ఈ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు ప్రారంభించడానికి మిడిల్ ఈస్ట్‌లోని మిత్రదేవాలు చేసిన ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఖార్గ్ ద్వీపం ప్రత్యేకత:

ఇరాన్ మొత్తం చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు రవాణా జరిగే హార్ముజ్ జలసంధికి దగ్గరలో ఈ ద్వీపం ఉంటుంది. ఇక్కడ దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఖార్గ్‌పై దాడులతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అమెరికాకు సహకరిస్తున్న యూఏఈలోని ఓడరేవులపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఖార్గ్ దీవి ఇరాన్ దక్షిణ తీరానికి సుమారుగా 30 కి.మీ దూరంలో ఉంది.

అయితే, ఖార్గ్ ద్వీపం అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో ప్రధానంగా సైనిక మౌలిక సదుపాయాలను మాత్రమే టార్గెట్ చేసింది. ఆయిల్ నిల్వలు, ఎక్స్‌పోర్ట్ టెర్మినల్స్‌పై ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయలేదు. ఈ దాడి ద్వారా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించామని అమెరికా చెబుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Donald Trump
  • Global Oil Prices
  • Iran Retaliation UAE
  • Iran War
  • Iran War Impact

తాజావార్తలు

  • Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

  • Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. ఈసారైనా హిట్టు వచ్చేనా?

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • 5-states elections: బెంగాల్ సహా 5-రాష్ట్రాల ఎన్నికలకు తేదీలు ఖరారు, ఈ రోజు ప్రకటన.!

  • Rakasa : ‘రాకాస’ అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది : నిహారిక కొణిదెల

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions