Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌పై తన అభిమానాన్ని ప్రదర్శించారు. ఈజిస్ట్ షర్మ్ ఎల్ షేక్‌లో జరిగిన శాంతి సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ఆసిమ్ మునీర్‌ను తన ‘‘ అభిమాన ఫీల్డ్ మార్షల్’’ అంటూ పిలిచారు. గాజాలో శాంతి నెలకొల్పడంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తనకు మద్దతు తెలిపారని, అందుకు ఆయనకు థాంక్స్ అని ట్రంప్ అన్నారు.
ప్రధాని మోడీని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. అది కూడా ప్రపంచ అగ్ర నాయకులంతా ఒక చోట నిలబడి ఉండగా.. అంతేకాకుండా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పక్కనే ఉండగా ఈ సంఘటన జరగడం విశేషం. ఈజిప్టులో గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది.