పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 ఏడి”..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు .అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్,విశ్వనటుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా హిందూ పురాణకథలు నేపథ్యంతో తెరకెక్కుతుంది.రీసెంట్ గా బిగ్ బి అమితాబ్ అశ్వద్దామ పాత్రలో నటిస్తున్నట్లుగా మేకర్స్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసారు.ఈ వీడియో సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది.
అయితే ఈ సినిమాలో రానా దగ్గుబాటి నటిస్తున్నారని అందుకే రానా కల్కి మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నట్లు అందురు భావించారు. అయితే తాజా ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ.. తాను కల్కి సినిమాలో నటించడం లేదని, కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే పని చేస్తున్నాని చెప్పుకొచ్చారు. అయితే అదే ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి మాట్లాడుతూ.. బాహుబలి తరువాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ సినిమా మరో టర్నింగ్ పాయింట్ కాబోతుందని తెలిపారు. మార్వెల్ సినిమాలు మాదిరి కల్కి సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని రానా తెలిపారు.అందుకే “కల్కి” ఫస్ట్ లుక్ ని కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేశామని రానా చెప్పుకొచ్చారు.
#Kalki2898AD is next big thing from India – #Rana
#Prabhas #Kalki2898ADonJune27 pic.twitter.com/puTocIuwPC
— Kalki 2898AD FC (@Kalki2898AD_FC) May 4, 2024