Triumph Scrambler 400 X: ప్రసిద్ధ బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ కు కొత్త లావా రెడ్ శాటిన్ రంగు వేరియంట్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇదివరకు అందుబాటులో ఉన్న వోల్కానిక్ రెడ్ అండ్ ఫాంటమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌కు భిన్నంగా ఈ కొత్త రంగు మరింత ఆకర్షణీయంగా, ప్రీమియంగా కనిపిస్తుంది. ఈ రంగు కొత్తగా వచ్చినప్పటికీ బైక్‌లో మెకానికల్ మార్పులు ఏవీ జరగలేదు. ఈ శాటిన్-ఫినిష్డ్ రంగుతో వచ్చే కొత్త ధర రూ. 2.67 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. ఇది మునుపటి ధర కంటే కేవలం రూ. 700 పైగా పెరిగింది.
Read Also: Pawan Kalyan: నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి!
స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌లో 398.15 సిసి లిక్విడ్-కూల్డ్ TR-సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది 39.5 bhp పవర్, 37.5 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఆరు-గేర్ బాక్స్ తో ఈ బైక్ స్మూత్, ఖచ్చితమైన ట్రాన్స్మిషన్‌ను అందిస్తుంది. ఈ శక్తివంతమైన మెకానిజం బైక్‌ను రోడ్డుపై, ఆఫ్‌రోడ్ ప్రయాణాల్లోనూ సమర్థంగా నడపగలిగేలా చేస్తుంది. లావా రెడ్ శాటిన్ రంగు ప్రధానంగా బైక్ ట్యాంక్‌పై కనిపిస్తుంది. దీనికి ఫాంటమ్ బ్లాక్ స్ట్రిప్ ఆకర్షణగా ఉంటుంది. మిగతా భాగాలైన ఇంజిన్ కేసింగ్, సైడ్ ప్యానల్స్, ఎగ్జాస్ట్ మొదలైనవి పాత వేరియంట్ల మాదిరిగానే కొనసాగుతున్నాయి. ఈ కొత్త రంగు రూపురేఖలు స్క్రాంబ్లర్ 400 ఎక్స్ క్లాసిక్ డిజైన్‌ను కొత్తగా మెరుగుపరిచినట్లు చెప్పవచ్చు.
Read Also: Stock Market Rally: సెన్సెక్స్ 2,000 పాయింట్లు పైగా జంప్.. మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలు ఇవే!
ఇతర స్పెసిఫికేషన్ల పరంగా.. బైక్‌లో సెమీ-అనలాగ్ స్పీడోమీటర్ LCD స్క్రీన్‌తో కొనసాగుతుంది. అయితే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో లేవు. ఇది కొంత మైనస్ పాయింట్ గా కనిపిస్తోంది. ఇక ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ త్వరలోనే ఆఫ్-రోడ్ ప్రాధాన్యం గల మోడల్ స్క్రాంబ్లర్ 400 XCను మార్కెట్‌లో ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఇందులో క్రాస్-స్పోక్ వీల్స్ లాంటి ప్రత్యేకతలు ఉండే అవకాశముంది. ఇది మరింత అడ్వెంచర్-ఫోకస్డ్ రైడర్లకు ఉపయోగపడేలా ఉండనుంది. కొత్త రంగును పరిచయం చేసినప్పటికీ, ట్రయంఫ్ బైక్ ధరను పెద్దగా పెంచకపోవడం బైక్ పై తమ నమ్మకాన్ని చూపుతుంది. భారత మార్కెట్‌లో రూ. 2.67 లక్షల ధర టాప్ క్లాస్ ఫీచర్లు లేకపోయినా, బలమైన ఇంజిన్, స్టైలిష్ లుక్, బ్రాండ్ ఇమేజ్ కారణంగా బైక్‌ను ప్రత్యేకంగా నిలబెడుతోంది.