Stock Market Rally: నేడు (మే 12) ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీతో దూసుకెళ్లాయి. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం భయభ్రాంతుల్లో ఉన్న ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడమే కాక, అంతర్జాతీయంగా కలిసి వచ్చే సానుకూల సంకేతాలు, భారత్‌కు క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్ వంటి అంశాలు మార్కెట్‌కు పుంజుకొనే బలాన్ని ఇచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో 2,200 పాయింట్లు లాభాల వైపు దూసుకెళ్ళగా.. ప్రస్తుతం 81,660 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 కూడా 680 పాయింట్లు పెరిగి 24,690 వద్ద ట్రేడ్ అవుతుంది. మిగితా మార్కెట్ సూచికలు కూడా ట్రేడింగ్ ప్రారంభంలో భారీగా పెరిగాయి.
Read Also: Fire break out: భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 22 గోదాములు..!
యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, రిలయన్స్ వంటి హెవీ స్టాక్స్ ఏకంగా 4% వరకు లాభపడ్డాయి. భారత్–పాకిస్తాన్ మధ్య క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు జరిగిన కొన్ని రోజుల తరువాత శాంతి చర్చలు ప్రారంభమవడం మార్కెట్‌కు పెద్ద ఊరటనిచ్చింది. వీకెండ్‌లో ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం మార్కెట్లు పుంజుకుంటాయని నిపుణులు ముందే సూచించగా అందుకు తగ్గట్టుగానే నేడు మార్కెట్ దూసుకెళ్తుంది.
Read Also: Hemoglobin: శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడానికి ఇలా చేస్తే సరి!
మరోవైపు, అమెరికా–చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతుండటం కూడా ప్రపంచ మార్కెట్‌కు మద్దతు ఇస్తోంది. ఇదిలా ఉంటే, మదుపరులు తాత్కాలికంగా ఈ బులిష్ ట్రెండ్‌ను స్వాగతించినప్పటికీ, భద్రతా అంశాలపైనా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.