లీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రీసెంట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించాడు.ప్రస్తుతం విజయ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే రాజకీయ ఆరంగేట్రం కంటే ముందు విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” తర్వాత ఒకే ఒక్క సినిమా చేసి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నాడు. ఇలాంటి తరుణంలో విజయ్ నటిస్తున్నఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ తెగ వైరల్ అవుతుంది..టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో దళపతి విజయ్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చెన్నై బ్యూటీ త్రిష కూడా నటిస్తున్నట్లు తెలిసింది.
గత ఏడాది వచ్చిన ‘లియో’ సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఇప్పుడు మరోసారి “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”సినిమాలో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో త్రిష ఓ స్పెషల్ క్యామియో రోల్ చేస్తుందని, ఇప్పటికే ఆమె భాగానికి సంబంధించి చిత్రీకరణ కూడా పూర్తయిందని కోలీవుడ్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అయితే మూవీ టీం నుంచి ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కోలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకట్ ప్రభు గత ఏడాది అక్కినేని నాగచైతన్యతో ‘కస్టడీ’ అనే సినిమాని తెరకెక్కించగా.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈసారి దళపతి విజయ్ తో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు.. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు కోసం భారీ బడ్జెట్ తో పాటు స్టార్ కాస్ట్ ని ఎంచుకున్నాడు. ఈ సినిమాలో దళపతి విజయ్, మీనాక్షి చౌదరి తో పాటు మలయాళ సీనియర్ నటుడు జయరాం, స్నేహ, లైలా, యోగి బాబు, VTV గణేష్, అజ్మల్ అమీర్, మిక్ మోహన్, ప్రభుదేవా, వైభవ్ మరియు అరవింద్ ఆకాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.