Tamil Nadu: తమిళనాడులో విషాదం..కల్తీసారా 18 మంది మృతి..
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 60 మంది
- అందులో 25 మంది సీరియస్
- మృతదేహాలతో దుకాణం ముందు ధర్నాకు దిగిన బాధితులు
- స్పందించిన సీఎం స్టాలిన్
- ఆస్పత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచన
- జిల్లా కలెక్టర్.. ఎస్పీపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో విషాదం నెలకొంది. కల్లకురిచిలో కల్తీసారా తాగి తొమ్మిది మంది మృతి చెందారు. ఇంకా వివిధ ఆసుపత్రిలో చికిత్స 60 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 25 మంది సీరియస్ గా ఉన్నారు. మృతదేహాలతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. ఆగ్రహంతో సారా అమ్మిన దుకాణాన్ని గ్రామస్థులు ధ్వంసం చేశారు. చికిత్స పొందుతూన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. అలర్ట్ అయిన ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించింది. కల్లకూరిచి ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని… రాష్ట్రంలో కల్తిసారా అడ్డాగా మారిందని మాజీ సీఎం పళణి స్వామీ విమర్శించారు.
READ MORE: Eyes Care Tips: కంటి శుక్లం సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఇలా చేయండి..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ సారా విక్రయాలపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
READ MORE: Bandi Sanjay Kumar: కేంద్రంలోనూ వేముల వాడ రాజన్న ఆలయ విశిష్టతపై చర్చ
ఈ కల్తీ మద్యం ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. కేసును క్షుణ్ణంగా విచారించాలని క్రైమ్ బ్రాంచ్- క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం(సీబీసీఐడీ)ని సీఎం స్టాలిన్ ఆదేశించారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్ జాదావత్‌ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎంఎస్ ప్రసాద్‌ను నియమించారు. జిల్లా ఎస్పీ సమై సింగ్ మీనాని కూడా తొలగించి, రజత్ చతుర్వేదికి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు, జిల్లా ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్‌కు చెందిన డీఎస్సీ తమిళ్ సెల్వన్ నేతృత్వంలోని టీమ్‌ను సస్పెండ్ చేశారు. మంత్రులు ఈవీ వేలు, ఎం సుబ్రమణ్యం కళ్లకురిచ్చి ఆస్పత్రిని సందర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!