భారతదేశంలో కంటిశుక్లం పెద్ద సమస్యగా మారుతోంది. WHO, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్‌నెస్ (NPCB) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం భారత్ లో 22 మిలియన్లకు పైగా ప్రజలు అంధులుగా ఉన్నారు. వీటిలో 80.1% కేసులు కంటిశుక్లం కారణంగానే కంటి చూపు కోల్పోయారు. ప్రతి సంవత్సరం దాదాపు 3.8 మిలియన్ల మంది కంటిశుక్లం కారణంగా అంధులవుతున్నారు. కంటి శుక్లం సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఈ ట్రిప్ ఫాలో అవ్వండి. ఎక్కువసేపు వేడికి గురికావడం వల్ల కళ్లు పొడిబారడం, చికాకు కలిగించవచ్చు. అయితే విపరీతమైన చలి వల్ల రక్తనాళాలు తగ్గి, కళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుంది. మీ కళ్ళను రక్షించుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించండి. తగినంత నీరు త్రాగండం మంచింది. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ధూమపానం వల్ల కంటిశుక్లం అధ్వాన్నంగా ఉంటుంది. పొగాకు పొగలో ఉండే టాక్సిక్ కెమికల్స్ కళ్ల లెన్స్‌లో ఉండే ప్రొటీన్లను దెబ్బతీసి చూపు మందగింపజేస్తుంది.
స్టెరాయిడ్స్‌ను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల కంటిశుక్లం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. స్టెరాయిడ్స్ కంటి లెన్స్ నిర్మాణంలో మార్పులకు కారణమవుతాయి. ఆయుర్వేద వైద్యులు, వైద్యులను సంప్రదించకుండా ఎలాంటి మందులు వాడకూడదు. కంటిశుక్లం ప్రారంభంలోనే గుర్తించేందుకు రెగ్యులర్ కంటి పరీక్ష చాలా ముఖ్యం. దీంతో కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా సకాలంలో గుర్తించవచ్చు. సకాలంలో చికిత్స చేయడం ద్వారా నయం చేయవచ్చు. తర్పణ్, అష్యోతన్ కర్మ అనేవి ఆయుర్వేద చికిత్సలు. ఇవి ముఖ్యంగా కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తాయి. తర్పణం అనేది పోషణను అందించడానికి మరియు దృష్టిని మెరుగుపరచడానికి కళ్ళ చుట్టూ ఔషధ నెయ్యిని పూయడం. అష్చ్యోతన కర్మ అనేది కళ్ళను శుభ్రపరచడానికి మరియు దృష్టిని మెరుగుపరచడానికి మూలికా కంటి చుక్కలను ఉపయోగించడం. సరైన కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ చికిత్సలు అనుసరించాలని సిఫార్సు చేయబడింది.