Nethi Bobbatlu: తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన పండుగలు ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా అనేక పండుగలకు చాలా ఇళ్లలో కనిపించే వంటకం నేతి బొబట్లు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. అయితే, ఈ బొబ్బట్లను ఒక్కొక ప్రాంతంలో ఒక్కో విధంగా తాయారు చేస్తుంటారు. అంతేకాకుండా, ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. పండగలు, పబ్బాలు, పూజలు, శుభకార్యాలు, విందు విందాలు వంటి వేడుకల్లో ఈ బొబట్లు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. బక్షాలు, ఓళిగలు, బొబట్లు ఇలా పేరు ఏదైనా నెయ్యి వేసుకుని వేడి వేడిగా తింటే రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి త్వరలో రాబోయే ఉగాది స్పెషల్‌గా ఇంట్లోనే మెత్తటి, కమ్మని బొబ్బట్లను తయారు చేసుకోవడం ఎలా అనేది ఒకసారి చూద్దాం.
Read Also: IPL 2025: నికోలస్ పూరన్ అరుదైన రికార్డు.. హిట్‌మ్యాన్ రోహిత్ వల్ల కూడా కాలే!
బొబ్బట్టు తయారీకి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే.. శనగపప్పు – 1 కప్పు, బెల్లం – 1 కప్పు, యాలకుల పొడి, నెయ్యి – 1/4 కప్పు, గోధుమ పిండి – 1 కప్పు, మైదా పిండి – 1 కప్పు, అవసరమైనంత నీరు ఉండాలి. ఇలా అనే కాదు మీ ఇంట్లోని సభ్యులకు అనుగుణంగా వీటిని పెంచుకోవచ్చు. ఇక బొబ్బట్టు తయారీ విషయానికి వస్తే.. ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, చిరోటి రవ్వ లేదా బాంబే రవ్వలను వేసి బాగా మిక్స్ చేయాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత, కొంచెం కొంచెం నీరు పోసి, చపాతీ పిండి కంటే కొంచెం లూజుగా కలిపి పిండిని సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి, నూనె వేసి బాగా కలిపి పైభాగంలో కొద్దిగా నూనె రాసి పక్కకు పెట్టాలి.
ఆ తర్వాత ముందుగా శనగపప్పును రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దానిని కుక్కర్ లో నానిన శనగపప్పును అందులో వేసి సరిపడా నీరు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ లోని అదనపు నీటిని తొలగించి, శనగపప్పును మెత్తగా మెదపుకోవాలి. ఆపై స్టవ్ మీద గిన్నె పెట్టి మెదిగిన శనగపప్పును అందులో వేసి, అందులో బెల్లం బాగా కలిపి మరిగించాలి. అలా మధ్యలో మీకు ఇష్టమైతే, అందులో నెయ్యిని కూడా చేర్చుకోవచ్చు. ఇలా కొద్దీ సేపటి తర్వాత మిశ్రమం గట్టిపడే సమయంలో యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక ఈ పదార్థం కాస్త బరకగా ఉన్నట్లు అనిపిస్తే.. ఆ మిశ్రమాన్ని మిక్షి లో కొద్దీ సేపు తిప్పితే మెత్తగా వస్తుంది. దీనితో అవసరమైన పూర్ణం తయారు అవుతుంది. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
Read Also: Ashutosh Sharma: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నా గురువుకు అంకితం..
ముందుగా రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోని, ప్రతి ఉండను చేతితో ఒత్తి మధ్యలో పూర్ణం పెట్టి.. పూర్ణాన్ని పూర్తిగా కప్పేలా ఉండగా మళ్లీ మూయాలి. ఆ తర్వాత ఒక బట్టర్ పేపర్ పై నెయ్యి లేదా నూనెను రాసిన తరువాత దానిపై పిండిని పెట్టి చేతితో ఒత్తి బొబ్బట్టుగా చేసుకోవాలి. లేదా చపాతీ కర్రతో చపాతీలా రుద్దుకోవాలి. స్టవ్ మీద పెనం వేడెక్కిన తర్వాత, బొబ్బట్టును పెనంపై వేసి, మీడియం మంటపై రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అలా కలుస్తున్న సమయంలో నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ వేడిగా బొబ్బట్టును రెడీ చేసుకోవాలి. ఇంకేముంది మనకు ఎంతో ఇష్టమైన బొబ్బట్లు రెడీ అవుతుంది.