TPCC Mahesh Goud : పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై.. ఏడాది మా పాలనపై చర్చకు మేం సిద్ధమని పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అన్నారు. ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దు అనే.. వికేంద్రీకరణ చేశామని ఆయన తెలిపారు. కేటీఆర్ తప్పు చేశా అని ఫీల్ అవుతున్నాడు కాబట్టి జైలుకు పోతా అంటున్నాడని, మేం విచారణ జరపకుండా నే..జైలుకు పోతా అంటున్నాడని ఆయన అన్నారు. కొన్ని నియోజక వర్గాల్లో సమస్యలు ఉన్నాయి.. వాటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ లో ఉన్న మాట వాస్తవమని, మాది కార్యకర్తల పార్టీ.. వాళ్లకు పదవులు ఇవ్వాల్సి ఉంది.. కాస్త ఆలస్యం అయ్యిందన్నారు. బీఆర్‌ఎస్ హయంలో అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయని, కాస్త సమయం పడుతుందన్నారు. పార్టీ.. ప్రభుత్వం మధ్య సమన్వయంతోనే నడుస్తుందని, అధికారంలోకి వచ్చాము.. కాబట్టి సోషల్ మీడియా కొంత ఆక్టివ్ గా లేదన్నారు. కానీ బీఆర్‌ఎస్ వాళ్ల మాదిరిగా మేము దిగజారి రాజకీయాలు చేయలేమన్నారు.
TPCC Mahesh Goud : ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దనే వికేంద్రీకరణ చేశాం
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలపై చర్చకు మేం సిద్ధం
- కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టే జైలుకు పోతా అంటున్నాడు
- మేం విచారణ జరపకుండానే జైలుకు పోతానంటున్నాడు
- పదవుల విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది :పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్

Maheshkumar