పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై.. ఏడాది మా పాలనపై చర్చకు మేం సిద్ధమని పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అన్నారు. ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దు అనే.. వికేంద్రీకరణ చేశామని ఆయన తెలిపారు.
ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్ఘంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎక్కడ ఎదో జరిగితే అది KTR కి ఎం సంబంధమని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయని, రేవంత్ సోదరుల ఇళ్ళ పై పోలీసులకు ఇలాగే చేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు.
నిన్న రాజ్ పాకాల సొంత ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేసిన సందర్భం అని, 2, 3 రోజుల్లో ఒక రోజు వెజ్, మరో రోజు నాన్ వెజ్ లతో వంటలతో ప్రోగ్రాంలు చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎవరు కంప్లైంట్ చేశారో తెలియదని, అక్కడ పోలీసులు దాడులు చేశారన్నారు.