Congress: చివరి దశకు టీపీసీసీ చీఫ్ కసరత్తు..
- ఈరోజు కూడా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- పీసీసీ చీఫ్.. కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు
- పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసిన ఏఐసీసీ పెద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. నేడు వరంగల్ పర్యటన ఉన్నా.. తన టూర్ ను వాయిదా వేసుకుని హస్తినలోనే ఉన్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సహా.. డిప్యూట సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అనే అంశంపై చర్చించారు. అటు.. ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది.
Inzamam-ul-Haq: భారత్ ఫైనల్‌కి చేరడంపై పాకిస్తాస్ అక్కసు.. టీం ఇండియాకి వేరే రూల్స్ అంటూ..
Also Read
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేసే యోచనలో ఉంది. దీంతో పదవులు ఆశిస్తున్న వారంతా ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు. పార్లమెంట్ హాల్లో పార్టీ అధినేత సోనియా గాంధీని మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ వేర్వేరుగా కలిసి తమ మనసులోని మాటను ఆమెకు తెలియజేశారు. ఇక.. హస్తినలోనే ఉన్న ముఖ్య నేతలు ఎవరెవరికి ఏఏ పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. కేబినెట్ లో ఒకేసారి ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాలా.. లేదా కొన్నింటిని పెండింగ్ లో ఉంచాలా అన్న దానిపై మంతనాలు సాగుతున్నాయి.
Kalki 2898AD : ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టిన కల్కి
ఇక.. మంత్రి మండలి కూర్పు, కాంగ్రెస్ లో చేరికల అంశం భేటీలో చర్చకు వచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామని తెలిపారు. లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని, సీడబ్ల్యూసీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని అన్నారు. అటు.. సామాజిక సమీకరణాలతో పాటు సీనియార్టీ, సమగ్రవంతమైన నాయకుడికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇవాళ కొత్త పీసీసీ పేరు ఖరారు అవుతుందా లేదా ఇంకా టైమ్ పడుతుందా అనేది సస్పెన్స్ గా మారింది.
తాజావార్తలు
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!