Toyota Camry Launched: టయోటా తన కొత్త సెడాన్ క్యామ్రీని భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.48 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారును సిమెంట్ గ్రే, యాటిట్యూడ్ బ్లాక్, డార్క్ బ్లూ, ఎమోషనల్ రెడ్, ప్లాటినం వైట్ పెర్ల్, ప్రెషియస్ మెటల్ అనే 6 డిఫిరెంట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ సెడాన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదలై అమ్మకాలలో దూసుకవెళ్తోంది. ఇకపై ఈ సెడాన్ కారును భారతీయ మార్కెట్‌లో కూడా కొనుగోలు చేయగలుగుతారు.
Also Read: Supreme Court: “ప్రార్థనా స్థలాల చట్టం”.. మందిర్-మసీదు వివాదాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
కంపెనీ ఈ ప్రీమియం సెడాన్‌ను ఫుల్లీ లోడ్ చేసిన సింగిల్ వేరియంట్‌లో మాత్రమే పరిచయం చేసింది. టయోటా క్యామ్రీ 2.5-లీటర్ పెట్రోల్ డైనమిక్ ఫోర్స్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది e-CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఈ ఇంజన్ 230bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇది ఎకో, స్పోర్ట్, నార్మల్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. క్యామ్రీ డిజైన్ గురించి చూస్తే.. ఇందులో ఆకర్షణీయమైన గ్రిల్, C – ఆకారపు LED DRLలు, మల్టీ – స్పోక్ అల్లాయ్ వీల్స్, షార్ప్-క్రీజ్ డోర్ ప్యానెల్‌లు, కొత్త డిజైన్ LED టెయిల్‌ల్యాంప్‌లు ఇంకా హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.
Also Read: BiggBoss 8 : బిగ్ బాస్ 8 ఫైనల్ గెస్ట్ ఎవరో తెలిసి పోయిందోచ్ !
ఇక కారు లోపలి భాగం గురించి చెప్పాలంటే.. ఇందులో పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. కొత్త గ్రాఫిక్స్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, కొత్త స్టీరింగ్ వీల్, అప్డేట్ చేయబడిన సెంటర్ కన్సోల్ ఇంకా సీట్ అప్హోల్స్టరీ, మల్టీ – జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS అలాగే 360-డిగ్రీ సరౌండ్ కెమెరాతో సహా అనేక అధునాతన ఫీచర్‌లతో కారు విడుదలైంది. ఇది HUD, EPB, వైర్‌లెస్ మొబైల్ ప్రొజెక్షన్, వైర్‌లెస్ ఛార్జర్, 10-వే అడ్జస్టబుల్ పవర్డ్ ఫ్రంట్ సీట్, 9 ఎయిర్‌బ్యాగ్‌లు ఇంకా రిక్లైన్ ఫంక్షన్ సీటు ఇలా అనేక రకాల ఆకర్షణీయమైన సదుపాయాలను అందించారు.