BiggBoss 8 : బిగ్ బాస్ 8 ఫైనల్ గెస్ట్ ఎవరో తెలిసి పోయిందోచ్ !
- ఆఖరి ఘట్టానికి చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 8
- ఫైనలిస్ట్ ఎవరో తెలిసేది ఈ ఆదివారమే
- చీఫ్ గెస్ట్ గా బన్నీ వస్తారని టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BiggBoss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఈ వారంతో పూర్తి కాబోతుంది. దాదాపు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. డిసెంబర్ 15 ఆదివారం సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది. ఇప్పటికే హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో తెలిసి పోయింది. వీరిలో ఫైనల్ గా టైటిల్ విజేత ఎవరన్నది మాత్రం తేలాల్సి ఉంది. టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్లను చూస్తే నిఖిల్, గౌతమ్ లు టైటిల్ రేసులో ఉన్నారని ఓటింగ్ పరంగా తెలుస్తోంది. మరోపక్క ఆడపులిలా ఆడుతున్న ప్రేరణ టాప్ 3 కి వచ్చేసినట్లే అని చెప్పొచ్చు. ఆ నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో అవినాష్, ఫిఫ్త్ ప్లేస్ లో నబీల్ ఉన్నారు. అవినాష్, ప్రేరణలు అసలు టాప్ 5 దాకా వస్తారా అన్న డౌట్ మొదటి నుంచి నెలకొంది. అవినాష్ ఫినాలే టికెట్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. మనకేంటి ఫైనలిస్ట్ అయ్యాం కదా అని రిలాక్స్ అవ్వకుండా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇక మరోపక్క ప్రేరణ టాప్ 5 అయ్యాం కదా అని కాకుండా బీబీ సీరియల్ పరివార్ తో కలిసి ఆడుతున్న ఆటల్లో అదరగొట్టేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ కి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి సర్ ప్రైజ్ గెస్ట్ రాబోతున్నారని తెలుస్తోంది.
Read Also:Shocking Incident: బైక్ కొనివ్వలేదని తాళాలు మింగిన యువకుడు.. చివరకు..
Also Read
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
- IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
ఈ మధ్యనే థియేటర్ లో పుష్ప రాజ్ పాత్రలో పూనకాలు తెప్పించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సారి ఫైనల్ ఎపిసోడ్ కు రాబోతున్నట్లు తెలుస్తోంది. సీజన్ 8 ఎపిసోడ్ కి అల్లు అర్జున్ వస్తే మాత్రం అది నేషనల్ లెవల్లో ట్రెండ్ సెట్టర్ అయ్యే అవకాశం ఉంది. పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక అల్లు అర్జున్ అటెండ్ అవుతున్న ఫస్ట్ షో ఇదే అని చెప్పొచ్చు. మరి ఈ ఫైనల్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది. కింగ్ నాగార్జున పుష్ప రాజ్ అదే అల్లు అర్జున్ గురించి ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా ఉంది. సో ఈ సీజన్ ఫైనల్ విన్నర్ అల్లు అర్జున్ చేత టైటిల్ అందుకోబోతున్నాడని తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ టీం నుంచి అఫీషియల్ కన్ ఫర్మేషన్ రావాల్సి ఉంది. బిగ్ బాస్ స్టేజ్ మీద పుష్ప రాజ్ వస్తే మాత్రం ఆ ఎపిసోడ్ టీఆర్పీ మోత మోగిపోద్దని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది హైలెట్ ఎపిసోడ్ గా ఇది నిలుస్తుందని చెప్పొచ్చు.
Read Also:Bashar al-Assad: సిరియా నుంచి బషర్ అల్ అస్సాద్‌ని రక్షించిన రష్యా సీక్రెట్ ప్లాన్..
తాజావార్తలు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!