Site icon NTV Telugu

India-Pakistan War: విదేశాలకు పారిపోవడానికి యత్నిస్తున్న పాక్ ఉన్నతాధికారులు?

India Pakistan War1

India Pakistan War1

ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్థాన్ గురువారం రాత్రి భారత్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం పాకిస్థాన్‌లోని వివిధ ప్రధాన నగరాలపై సంయుక్త దాడులు ప్రారంభించాయి. ఈ దాడి కాస్త క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో పాకిస్థాన్ లోని సాధారణ ప్రజలు, అధికారులు భయపడుతున్నారు. చాలా మంది పాక్ అధికారులు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారులు విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించిందని పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.

READ MORE: India-Pakistan War: సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం.. పెద్దఎత్తున చొరబాటుకు యత్నం..

తాజా సమాచారం ప్రకారం.. భారత దాడుల తీవ్రతతో పాకిస్థాన్ నాయకత్వంలో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. దీని కారణంగా కొంతమంది అధికారులు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. పాకిస్థాన్‌లోని ఉన్నతాధికారులు యుద్ధంలోకి నెట్టి దేశం విడిచిపెడితే, వారిని ఎవరు రక్షిస్తారని పాకిస్థాన్ ప్రజలు ఆందోళన చెందుతారు. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌లోని బహవల్‌నగర్ కాంట్ ప్రాంతం సమీపంలో తాజాగా శక్తివంతమైన పేలుడు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. వెంటనే ఆ ప్రాంతంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీని తరువాత, ప్రజలు భయాందోళనలతో తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మొత్తం ప్రాంతంలో గందరగోళ వాతావరణం నెలకొంది.

READ MORE: India-Pakistan War: పాక్ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.. భారత రక్షణశాఖ స్పష్టం..

Exit mobile version