జూలై 4న రాష్ట్రానికి రాష్ట్రపతి
జూలై 4న రాష్ట్రానికి రాష్ట్రపతి రానున్నారు ప్రకటన వెల్లడైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 4 వ తేదీన హైదరాబాద్ పర్యటన సందర్భంగా వివిధ శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు. డీజీపీ అంజనీ కుమార్ తోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, జులై 4 సాయంత్రం అల్లూరి సీతారామరాజు 125 వ జన్మదినం ఉత్సవాలలో పాల్గొంటారని తెలిపారు.
హైదరాబాద్‌లో మొట్టమొదటి స్కై వాక్ బ్రిడ్జి
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో స్కైవాక్ బ్రిడ్జిని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో మొట్టమొదటి స్కై వాక్ బ్రిడ్జి ఉప్పల్ లో ప్రారంభించామని తెలిపారు. 4, 5 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు త్వరలో ఇస్తామని, నారపల్లి-ఉప్పల్ బ్రిడ్జి నిర్మాణం కేంద్రం ఆలస్యం చేస్తోందన్నారు. 35 ఫ్లై ఓవర్లు, అండర్ వేలు తొమ్మిదేళ్ళలో నిర్మాణం పూర్తి చేసామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. ‘ఉప్పల్, అంబర్ పేట ఫ్లై ఓవర్లు బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. మోడీ – కేసీఆర్ పాలనకు ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణాలే నిదర్శనం. నాలుగేళ్ళ నుంచి ప్రజలను కేంద్ర ప్రభుత్వం చావగొడుతున్నారు. ఉప్పల్ లోని ఐదు పారిశ్రామికవాడలు ఉండేవి. వాటికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాము. నాడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త. 10 డివిజన్లలో మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మించాలి.
10 రోజులు మనవడి శవంతో గడిపిన అమ్మమ్మ.. అలా బయటపడ్డ రహస్యం
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వృద్ధురాలు తన మనవడి మృతదేహంతో 10 రోజుల పాటు గడిపింది. ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వీధి మొత్తం వ్యాపించడంతో, అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి చూడగా.. అక్కడి దృశ్యాన్ని చూసి ఖంగుతిన్నారు. లోపల ఓ యువకుడి మృతదేహం పడి ఉండటం చూసి షాకైన పోలీసులు.. ఆ మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బారాబంకిలోని కొత్వాలి పట్టణం మొహల్లా మొహరిపూర్వాలో ఈ ఘటన జరిగింది.
వీధుల్లోకి లక్షలాది మంది కొరియన్లు.. అమెరికాను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ
ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో వేలాది మంది కొరియన్లు వీధుల్లోకి వచ్చారు. వారాంతంలో ప్రజలు అమెరికన్ వ్యతిరేక మార్చ్‌ను చేపట్టారు. యునైటెడ్ స్టేట్స్‌ను నాశనం చేసినందుకు “ప్రతీకార యుద్ధం” అని ప్రతిజ్ఞ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. కొరియా యుద్ధం ప్రారంభమై 73వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలు మార్చ్‌ను చేపట్టారని ఆ దేశ మీడియా నివేదించింది.
ప్యోంగ్యాంగ్‌లో ఆదివారం జరిగిన భారీ ర్యాలీలకు 1,20,000 మందికి పైగా హాజరయ్యారని ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ర్యాలీలో ఉత్తర కొరియన్లు “యుఎస్ ప్రధాన భూభాగం మొత్తం మా షూటింగ్ రేంజ్‌లో ఉంది”, “సామ్రాజ్యవాద అమెరికా శాంతి విధ్వంసకం” అని రాసి ఉన్న బోర్డులను పట్టుకుని ర్యాలీల్లో పాల్గొన్నారు.
నరసరావుపేటలో అమ్మవారికి ఆషాడ బోనాలు సమర్పించిన ట్రాన్స్ జెండర్స్
తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో ఘనంగా బోనాల పండగా జరుగుతుంది. ఈ పండగను అంగరంగ వైభవంగా రాష్ట్ర నలుమూలల ఘనంగా జరుపుకుంటారు. అయితే, మేళతాళలతో పోతు రాజుల విన్యాసాలతో జోరుగా ఈ బోనాల జాతర కొనసాగుతుంది. అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేసేందుకు ట్రాన్స్ జెండర్స్ ముందు వరుసలో ఉంటారు. ఈ ఆషాడ బోనాల పండగ వారికి ప్రత్యేకమైనది. అమ్మవారిని తమ ఇంటి దైవంగా వారు భావిస్తారు. అయితే ఈ బోనాల పండగ అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరుపుకుంటారు.
మెగా కోడలు ఒక్కతే వెకేషన్ ఎంజాయ్ చేస్తుందే..
అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తరువాత ఈ చిన్నది మంచి అవకాశాలనే అందుకుంది. కానీ, స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడిపోయి.. ఆ ప్రేమను పెళ్లి వరకు తెచ్చుకుంది. గతనెల వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే. ఎంగేజ్ మెంట్ అయ్యిన దగ్గరనుంచి లావణ్య కాస్తా మెగా కోడలిగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఎక్కడ కనిపించినా అభిమానులు మెగా కోడలు అనే పిలవడం మొదలుపెట్టారు. ఇక ఎంగేజ్ మెంట్ అయ్యాక ఈ చిన్నది సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతుంది అని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని.. లావణ్య ఒక వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. డైరెక్టర్స్ లు వచ్చి ఆమెకు కథలు చెప్తూ ఉండడం ఆమెకు ఏవి నచ్చకపోవడం.. చివరికి ఒక వెబ్ సిరీస్ కు ఆమె కమిట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ కు లావణ్య కొద్దిగా బ్రేక్ తీసుకున్నట్లు కనిపిస్తుంది.
15 గంటల్లో 286 స్టేషన్లు కవర్ చేసిన ఓ వ్యక్తి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు..!
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఢిల్లీ మెట్రో ఒకటి. అక్కడ 287 మెట్రో స్టేషన్లలో ప్రతిరోజూ 17 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఢిల్లీ మెట్రో పసుపు, నీలం వంటి 10 లైన్లలో విస్తరించి ఉంది. దీని నెట్‌వర్క్ 348.12 కి.మీ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితిలో అన్ని స్టేషన్లను కవర్ చేయడానికి చాలా గంటలు పడుతుంది. ఏప్రిల్ 2021లో ఫ్రీలాన్స్ పరిశోధకుడు, ప్రయాణ ప్రియుడైన శశాంక్ మను ఢిల్లీ మెట్రోలో అలాంటి ఫీట్ చేసాడు. ఆ తర్వాత అతని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. అంతేకాకుండా ఆ వ్యక్తి ఇప్పటి వరకు 70 దేశాలు తిరిగినట్లు తెలుస్తోంది. అయితే తిరగడమంటే అతనికి ఎంత పిచ్చో..
ధోనీ అస్సలు ‘కూల్’ కాదు, అందరినీ తిట్టాడు.. ఇషాంత్ షాకింగ్ కామెంట్స్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ‘కెప్టెన్ కూల్’ అని పిలుస్తారనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే.. మైదానంలో ఫీల్డర్లు తప్పు చేసినా, మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నా, మ్యాచ్ చేజారే పరిస్థితిలో ఉన్నా.. అతడు ఆవేశం కోల్పోడు. చాలా కూల్‌గానే కనిపిస్తాడు. అందుకే, అతనికి ఆ పేరు వచ్చింది. అయితే.. ధోనీ అందరూ అనుకునేంత కూల్ కాదని, విరాట్ కోహ్లీతో పాటు టీమ్ సభ్యులందరినీ తిట్టాడంటూ ఇషాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫీల్డ్‌లో తనపై కూడా చాలాసార్లు అరిచాడని కుండబద్దలు కొట్టాడు. ఇషాంత్ మాట్లాడుతూ.. ‘‘ధోనీ సైలెంట్‌గా ఓ మూలకు కూర్చున్నాడంటే, అప్పుడు అతడు ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ టైమ్‌లో ఎవరైనా వెళ్లి డిస్టర్బ్ చేస్తే, ఇక అంతే సంగతులు. అందరూ
ధోనీని కూల్ అంటుంటారు కానీ, అతనేమీ అంత కూల్ కాదు. అలాగని అంతనికి అంత కోపం కూడా రాదు.
నిలిచిపోయిన చార్‌ధామ్ యాత్ర.. అధికారులకు సీఎం ఆదేశాలు
కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం కారణంగా చార్ ధామ్ యాత్రను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చార్ ధామ్ యాత్రలో వర్షం, మంచు కురుస్తున్న దృష్ట్యా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.”మార్గమధ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం చార్ ధామ్ యాత్రను నిలిపివేసింది. హిమపాతం, వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల వివిధ ప్రదేశాలలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చార్ ధామ్ యాత్రకు వచ్చే ప్రయాణికులు వాతావరణం అనుకూలించిన తర్వాత తమ యాత్రను కొనసాగించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.” అని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు.
నన్ను తిట్టినా, కొట్టినా భరిస్తాను.. రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో చెప్పండి..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో మార్పు కోసం పోరాడుతున్నానని.. ఈ పోరాటంలో తన ప్రాణాలు పోవచ్చు అని అన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఇవాళ (సోమవారం) పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని బీఆర్ అంబేద్కర్ జంక్షన్‌లో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతల స్పూర్తితో పరిపాలన జరగాలని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై నాకు వ్యక్తిగత కక్ష, ద్వేషం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలో ఎంతమందికి జగన్ ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఏపీకి వచ్చిన కంపెనీలు వెనక్కి పోతున్నాయని.. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేకపోతున్నారని పవన్ ప్రశ్నించారు.
పెళ్లిలో షాకింగ్ ఘటన.. వధువు మెడపై కత్తిపెట్టి కిడ్నాప్
అది ఒక పెళ్లి వేడుక. పెళ్లి తంతు మొత్తం ముగిసింది. తాళి కట్టడం, ఏడు అడుగులు నడవడం మొత్తం ముగిసింది. అప్పగింతలు కూడా అయిపోయాయి. అత్తారింటికి వెళ్లే ముందు నూతన వధూవరులు దేవుని దర్శనం కోసం వెళ్లారు. అక్కడే ఓ ఊహంచని పరిణామం చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు కానీ, ఓ యువకుడు సడెన్‌గా ఊడిపడ్డాడు. అందరి సమక్షంలోనే అతడు వధువు మెడపై కత్తిపెట్టి, ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని భీల్వాడా పరిధిలో బిజోలియాకు చెందిన రవి నాయక్‌కు లాఛుడాకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. వీరి పెళ్లిని ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో, వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అప్పగింతలు అయిపోయాక.. వధూవరులు తమ బంధువులతో కలిసి ఒక ఆలయానికి దేవుని దర్శనం కోసం వెళ్లారు. ఇంతలో ముగ్గురు యువకులు ఒక స్కూటర్ సడెన్ ఎంట్రీ ఇచ్చారు. కత్తులు చూపించి, పెళ్లివారిని బెదిరించారు.
ప్రభాస్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు..
జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నేడు పవన్ నరసాపురంలో వారాహి యాత్ర జరుగుతుంది. పవన్ ను చూడడానికి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. వారాహి యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి పవన్.. సినిమాల గురించి, అందరి హీరోల గురించి మాట్లాడుతూ.. అందరి అభిమానుల మనసులను ఫిదా చేస్తున్నారు. ఇక నరసాపురం .. ప్రభాస్ సొంత ఊరు మొగల్తూరు కు పక్కనే ఉన్న నరసాపురంలో పవన్ సభ మొదలు అయ్యింది, ఇక ఈ సభలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సందడి చేశారు. వారికి ప్రత్యేకంగా పవన్ థాంక్స్ చెప్పారు. అంతేకాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా తమకు మద్దతు తెలుపని అడిగారు. ఇక ప్రభాస్ గురించి, ఆయన నటించిన సినిమాల గురించి పవన్ చెప్పుకొచ్చారు.