టీమిండియాకు బెస్ట్ విషెస్.. కప్ తీసుకురావాలని ఆకాంక్ష
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీమ్ ఇండియా విజయాన్ని కాంక్షించారు. తన X (గతంలో ట్విటర్) ఖాతాలో.. ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ‘మెన్ ఇన్ బ్లూ’ అసాధారణమైన విజయాల రికార్డులను నెలకొల్పారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు, క్రికెట్ అభిమానులు టీమిండియాకు మద్దతు నిలుస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా.. టీమిండియాకు బెస్ట్ విషెస్ తెలియజేశాడు. ప్రపంచ కప్ ను తీసుకురావాలని ట్విట్టర్ లో కోరారు.
హిందూ మతం, అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి హిందూమతం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోవాలో శనివారం ది ఫ్యామిలీ లీడర్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రామస్వామి తన భార్య అపూర్వ న్యూయార్క్ లోని మెడికల్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు, ఆమెకు గర్భస్రావం జరిగిందని, మొదటి బిడ్డను కోల్పోయామని, రెండోసారి కూడా గర్భస్రావం జరుగుతుందేమో అనే భయాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు. హిందూ విశ్వాసమనే తనను అధ్యక్ష ఎన్నికల వైపు నడిపించిందని వివేక్ రామస్వామి వెల్లడించారు. ‘‘నా విశ్వాసమనే నాకు స్వేచ్ఛనిచ్చింది. నా విశ్వాసమే నన్ను అధ్యక్ష ఎన్నికల వైపు నడిపించింది. నేను హిందువును. నిజమైన దేవుడు ఒక్కడే అని నమ్ముతాను. దేవుడు మనలో ప్రతీ ఒక్కర్ని ఒక ప్రయోజనం కోసం ఇక్కడ ఉంచాడని నమ్ముతాను. హిందూ విశ్వాసం మనకు కర్తవ్యం, నైతిక బాధ్యతను బోధిస్తుంది. మన ద్వారా దేవుడు వివిధ మార్గాల్లో పనిచేస్తుంటారు. దేవుడు మనందరిలో ఉన్నందును మనం ఎప్పటికీ సమానమే, అదే నా విశ్వాసం’’ అంటూ హిందూ ధర్మం గురించి చెప్పారు.
ఆగి ఉన్న కారులో శవమై కనిపించిన మలయాళ నటుడు.. ఏసీనే ప్రాణం తీసిందా?
ప్రముఖ మలయాళ నటుడు వినోద్ థామస్ అనుమానస్పదంగా మృతి చెందారు.. ఈ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. కేరలోని కొట్టాయం పంపాడి సమీపంలోని ఓ హోటల్‌లో పార్క్ చేసిన వాహనంలో శవమై కనిపించడం సంచలనం రేపింది. హోటల్ యాజమాన్యం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినా వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అతని మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.. ఆయన మృతదేహన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు..
ఇకపోతే వినోద్ థామస్ కనిపించిన కారులో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ నుండి విషపూరితమైన పొగలు వస్తున్నట్లు గుర్తించారు. వాటి కారణంగా అతను చనిపోయి ఉంటాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేవరకు ఎటువంటి వివరణకు రాలేకున్నారు..
ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉంది
ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపామన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో ఏళ్ల కోరిక ఇది పరిష్కరించాలని స్వయంగా ప్రధాన మంత్రిని కలవడం జరిగిందన్నారు మంత్రి హరీష్ రావు. రెండవసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే వర్గీకరణ పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు మంత్రి హరీష్ రావు. కేంద్రం 9ఏళ్లు నానబెట్టి ఎన్నికల వేళ కొత్త కమిటీ అని చెబుతున్నదన్నారు. మనకు కావల్సింది కమిటీ కాదు బిల్లు పెట్టాలి. మా బి ఆర్ ఎస్ పార్టీ ఏకగ్రీవంగా మద్దతు ఇస్తామన్నారు హరీష్ రావు.
కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్..
స్నేహితుడే కదా అని నమ్మి వచ్చినందుకు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనే కాకుండా అతని స్నేహితుడు కూడా రేప్ చేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) క్వార్టర్స్‌లో నివసించే 19 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.
బుధవారం-గురువారం మధ్య రాత్రి చెంబూర్ పోస్టల్ కాలనీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత యువతి తండ్రి బార్క్‌లో పనిచేస్తున్నాడు. అతనికి కేటాయించి క్వార్టర్‌లో యువతి ఉంటుంది. ఉద్యోగ కారణాల రీత్యా ప్రస్తుతం తండ్రి వేరే ఊళ్లో ఉన్నాడు. నిందితుల్లో ఒకరైన 26 ఏళ్ల వ్యక్తి తండ్రి కూడా బార్క్‌లోనే పనిచేస్తున్నాడు. యువతికి, నిందితుడు తెలుసు.
కోహ్లీ ఔట్ తర్వాత అనుష్క ఎక్స్ప్రెషన్స్ చూడండి..
ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆసీస్ సారథి పాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడినట్లుగానే చేశాడు. స్టేడియంలో 1 లక్ష 32 వేల మంది టీమిండియా తరుఫున సపోర్ట్ చేస్తారని.. అభిమానులను ఎలా ఆశ్చర్యపరచాలో తనకు, తమ జట్టుకు తెలుసన్నాడు. అనుకున్నట్లు గానే చేసి చూపించాడు. టీమిండియా ఎక్కువగా ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఔట్ చేసి స్టేడియంలో ఉన్న అభిమానులందరినీ పిన్ డ్రాప్ సైలంట్ చేసి చూపించాడు. కోహ్లీ ఔట్ అవ్వడంతో స్టేడియంలో ఉన్న అభిమానులతో పాటు, విరాట్ సతీమణి అనుష్క శర్మ కూడా బాధపడుతున్నట్లు కనిపించింది.
అంతకుముందు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించగా.. వీఐపీ బాక్స్ లో కూర్చున్న అనుష్క లేచి నిలబడి చప్పట్లతో తన ప్రేమను చాటుకుంది. వన్డే కెరీర్‌లో కోహ్లీ మరో సెంచరీ పూర్తి చేస్తాడని అంతా భావించినా అభిమానులను నిరాశపరిచాడు. 28వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చిన పాట్ కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ వికెట్ భారత్‌కు ఎంత ముఖ్యమో తెలుసు. అదే సమయంలో పాట్ కమిన్స్ ఔట్ చేయడంతో.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.
తాడిచెర్ల ఓపెన్ కాస్టును ప్రైవేటుపరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్
మంచిర్యాల సింగరేణిలో నిరుద్యోగులకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు పోగొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మంచిర్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సింగరేణిలో 63,000 మంది కార్మికులు ఉండగా 40 వేల మంది కార్మికులను చేసిన ఘనుడు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. తాడిచెర్ల ఓపెన్ కాస్టును ప్రైవేటుపరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్ అని, ప్రధానమంత్రి మోడీ చాయ్ అన్నాడని, తల్లి ఇళ్లలో పనిచేసేదన్నారు. మోడీ కష్టాన్ని,ధైర్యాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నాడు కాబట్టే దేశ ప్రధానమంత్రి అయ్యాడని ఈటల వ్యాఖ్యానించారు. నేడు సింగరేణి చచ్చుబడిపోయిందని సింగరేణిలో కార్మికుల హక్కుల హక్కులను కాల రాసిన కేసీఆర్ అని, నేటికీ సింగరేణిలో ఎన్నికలు జరిపించలేదన్నారు.
టీడీపీకి బీ టీమ్ దగ్గుబాటి పురంధరేశ్వరి
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి పై కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఇవాళ కొడాలి నాని మాట్లాడుతూ.. టీడీపీకి బీ టీమ్ దగ్గుబాటి పురంధరేశ్వరి అని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ కి ద్రోహం చేసిన వారిలో ఆమె పాత్ర ఉందని, ఎన్టీఆర్ పదవిని చంద్రబాబు కి పదవిని ఇప్పించింది దగ్గుబాటి అని ఆయన ఆరోపించారు. చంద్రబాబుతో కలిసి ఆయన సీఎం అవటంలో కీలక పాత్ర పోషించిందని, దగ్గుబాటి పురంధరేశ్వరి లాంటి కూతురు ఎవరికి ఉండదన్నారు కొడాలి నాని. చంద్రబాబు చేసిన ప్రతి అవినీతిలో ఆవిడ వాటా ఆమెకు వెళ్తోందన్నారు. చంద్రబాబు ఇసుక దోపిడీ లో కూడా ఆవిడకు వాటాలు వెళ్ళాయని కొడాలి నాని వ్యాఖ్యానించారు. జగన్ ఇసుక దోపిడీ అంటూ సిగ్గులేని ఆరోపణలు చేస్తోందని, 4 వేలు కోట్లు ఆదాయం జగన్ హయాంలో ఇసుక ద్వారా వచ్చిందన్నారు కొడాలి నాని.
ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్..విమానాశ్రయం మూసివేత
జాతి సంఘర్షణ కారణంగా అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రం రాజధాని ఇంఫాల్‌లో ఉన్న ఎయిర్‌పోర్టును మూసేశారు. ఎయిర్ పోర్టుకు సమీపంలో గుర్తుతెలియని డ్రోన్ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం గగనతలంలో గుర్తుతెలియన డ్రోన్ కనిపించింది. వెంటనే విమాన కార్యకలాపాలను మూసివేయాని అధికారులు ఆదేశించారు.
ఇంఫాల్ లోని బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఫ్లైయింగ్ ఆబ్జెక్టును గుర్తించారు. దీంతో విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే 2 విమానాలను కోల్‌కతాకి డైవర్ట్ చేయగా.. మరో మూడు విమానాలు ఆలస్యమయ్యాయి. ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్ డైరెకర్టర్ చిపెమ్మి కీషింగ్ డ్రోన్ చూసినట్లు ఒక ప్రకటనలో ధృవీకరించారు. కాంపిటెంట్ అథారిటీ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మూడు విమానాలు బయలుదేరాయని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.
ఈ సారి జరిగే ఎన్నికలు మన తలరాత రాసుకునే ఎన్నికలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ.. కొత్తగూడెం పట్టణంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ బజార్ సెంటర్ లో స్ర్టిట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ సారి జరిగే ఎన్నికలు మన తల రాత రాసుకునే ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ముందు ఉంది కొత్తగూడెం.. ఢిల్లీ మెడలు వంచింది కొత్తగూడెం ప్రజలు అని ఆయన అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ వైపు బీజేపీ అడుగులు వేస్తున్న ఒక్క కాంగ్రెస్ ఎంపీ మాట్లాడలేదని, ఈ ఎన్నికల్లో డబ్బు సంచులతో బడా బడా సేట్లు డబ్బులు పట్టుకొని తిరుగుతున్నారు.. వారికి బుద్ధి చెప్పండన్నారు మంత్రి కేటీఆర్..
ప్రధాని మోడీ ర్యాలీ కోసం వెళ్తుండగా ప్రమాదం.. ఆరుగురు పోలీసుల మృతి..
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ర్యాలీ కోసం వీఐపీ డ్యూటీ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. ఒకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం ఆదివారం రోజున చురు జిల్లాలోని సుజన్‌గఢ్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనోటా పోలీస్ పోస్ట్ ఏరియాలో పోలీస్ సిబ్బందితో వెళ్తున్న వాహనం ట్రక్కును ఢీకొట్టింది. వీరంతా ఝంజులో జరిగే ప్రధాన మంత్రి ర్యాలీ కోసం డ్యూటీ చేసేందుకు వెళ్తున్నారు.
ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్యలో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన పోలీసుల్ని రామచంద్ర, కుంభారం, సురేష్ కుమార్, తానారామ్, మహేంద్ర కుమార్, సుఖ్‌రామ్‌గా గుర్తించారు. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ అబద్దాలను తిప్పికొట్టేందుకు ప్రచార, ప్రణాళిక కమిటీ పని చేస్తుంది
గాంధీభవన్‌లో ఆదివారం కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రచార సమన్వయం కోసం కమిటీలు వేశామన్నారు. కాంపెయిన్ కు చెందిన అంశాలపై చర్చించామని, 28వరకు ప్రచారాలు, వ్యూహం పై చర్చించామన్నారు. అనంతరం కోదండరెడ్డి మాట్లాడుతూ… 28 వరకు ప్రచారం కు సంబందించిన బాధ్యతలు కమిటీ సభ్యులకు ఇచ్చామని, 21నుండి 28వరకు ప్రచారం పీసీసీ, ఏఐసీసీ నేతలు చేస్తారన్నారు. విజయశాంతి ఖమ్మం, మహబూబాబాద్, సిటీ కి దగ్గర్లోని నియోజకవర్గాలలో ప్రచారం చేస్తారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారని, 28వ తేదీ వరకు వారి షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు కోదండరెడ్డి.
ఘనంగా ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి.. స్పెషల్ ఎట్రాక్షన్ గా చిరంజీవి
నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాలో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు కార్తీక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక ఎందుకో పెద్దగా అవకాశాలు సాధించలేక పోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేక పరిశ్రమలో నిలబడలేక పోయింది. తెలుగులో లాంచ్ అయినా తమిళంలో పలు చిత్రాల్లో నటించిన కార్తీక రంగం సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ సొంతం చేసుకుంది. ఇక ఆ తరువాత తెలుగులో ఎన్టీఆర్ సరసన దమ్ము సినిమాలో కూడా నటించి మెప్పించింది, ఆ సినిమా హిట్ కాకపోవడంతో తెలుగులో ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. సినిమాలు మానేసి ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయిన కార్తీక తాను ప్రేమించి రోహిత్ మీనన్ తో మూడు ముళ్లు వేయించుకుని.. ఏడడుగులు వేసింది.