అమరావతి నిర్మించింది.. ఆంధ్రాకు సాప్ట్‌వేర్‌ను పరిచయం చేసింది.. అందుకోసమే..!
ప్రజాగళం 32వ సభ గుంటూరు జిల్లాలోని తాడికొండలో జరుగుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఇది తాడికొండ కాదు రాష్ట్ర రాజధాని అమరావతి.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను.. ఈ రాజధానిని ఈ అమరావతిని ఒక వెంట్రుక కూడా ఎవరు కదిలించలేరు.. ఈరోజు ఏప్రిల్ 13.. మే 13న చరిత్ర తిరగబడుతుంది.. ప్రజలు రాసిన చరిత్ర మిగులుతుంది.. తెలుగువాడు గర్వపడేలా రాజధాని ఉండాలని సంకల్పంతో అమరావతిని నిర్మించేందుకు సిద్ధమయ్యాం అని ఆయన చెప్పుకొచ్చారు. 29 వేల మంది రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు.. అమరావతిని నిర్మించింది, ఆంధ్రప్రదేశ్ కు సాఫ్ట్వేర్ ను పరిచయం చేసింది నాకోసం కాదు.. ప్రజల కోసమే అని చంద్రబాబు అన్నారు.
అమరావతి నిర్మించింది.. ఆంధ్రాకు సాప్ట్‌వేర్‌ను పరిచయం చేసింది.. అందుకోసమే..!
ప్రజాగళం 32వ సభ గుంటూరు జిల్లాలోని తాడికొండలో జరుగుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఇది తాడికొండ కాదు రాష్ట్ర రాజధాని అమరావతి.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను.. ఈ రాజధానిని ఈ అమరావతిని ఒక వెంట్రుక కూడా ఎవరు కదిలించలేరు.. ఈరోజు ఏప్రిల్ 13.. మే 13న చరిత్ర తిరగబడుతుంది.. ప్రజలు రాసిన చరిత్ర మిగులుతుంది.. తెలుగువాడు గర్వపడేలా రాజధాని ఉండాలని సంకల్పంతో అమరావతిని నిర్మించేందుకు సిద్ధమయ్యాం అని ఆయన చెప్పుకొచ్చారు. 29 వేల మంది రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు.. అమరావతిని నిర్మించింది, ఆంధ్రప్రదేశ్ కు సాఫ్ట్వేర్ ను పరిచయం చేసింది నాకోసం కాదు.. ప్రజల కోసమే అని చంద్రబాబు అన్నారు.
సీఎం జగన్‌కు అభివాదం చేసిన వైఎస్ భారతీ..
గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంత సిద్ధం బస్సు యాత్ర చేసుకుంది. ఈ సందర్భంగా జగన్ బస్సుయాత్రలో అరుదైన దృశ్యం నెలకొంది. తాడేపల్లి జంక్షన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రకు ఆయన సతీమణి వైఎస్ భారతి సంఘీభావం తెలిపారు. బస్సుయాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికి భారతీ అభివాదం చేయగా.. దానికి ప్రతిగా బస్సులో నుంచి సీఎం జగన్ అభివాదం చేశారు. ప్రజలు, అభిమానుల మధ్య నుంచే ముఖ్యమంత్రికి ఆమె అభివాదం చేశారు. అయితే, కాసేపట్లో సీఎం జగన్ బస్సు యాత్ర విజయవాడకు చేరుకోనుంది. దీంతో ప్రజలతో కలిసి ఏపీ సీఎం సతిమణీ వైఎస్ భారతి స్వాగతం పలికారు. ప్రజల మధ్యలో నుంచే ఆమె జగన్ కు అభివాదం చేయడంతో అక్కడ ఉన్న వారందరూ వైఎస్ భారతీతో సెల్పీలు, ఫోటోలు తీసుకునేందుకు భారీగా వచ్చారు. వారితో ముచ్చటిస్తూ.. వైసీపీకి మద్దుతుగా నిలవాలని కోరారు. దీంతో ప్రకాశం బ్యారేజీపై మేమంతా సిద్ధమని నినాదంతో మార్మోగిపోతుంది.
తెలంగాణ ప్రజలు తెలివి లేకనే పది సంవత్సరాలు మీకు అధికారం కట్టబెట్టారా
కరీంనగర్ లోని డ్రైనేజీ త్రాగునీరు సమస్యలను తెలుసుకునేందుకు 21వ డివిజన్లో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పర్యటించారు. 21 డివిజన్లో డ్రైనేజీ వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. బోర్ నీళ్లలో కూడా డ్రైనేజీ వాటర్ కలవడంతో నీరు దుర్వాసన కొడుతోందని ఆయన వెల్లడించారు. కార్పొరేషన్ పరిధిలోనే ఉన్న 21వ డివిజన్లో అభివృద్ధి పనులను కార్పొరేషన్ ఆదిమరిచిందన్నారు. 21 డివిజన్ పాకిస్తాన్లో ఉందా బంగ్లాదేశ్ లో ఉందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ లో మిషన్ భగీరథ నీటి సప్లై ఉందంటూ కేసీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులలో పొట్టు పొట్టుగా పైసలు దండుకున్నారు బీఆర్ఎస్ నాయకులు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు తెలివి లేనోళ్ళంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన అమరవీరులను అవమానించిన కేటీఆర్.. తెలంగాణ ప్రజలు తెలివి లేకనే పది సంవత్సరాలు మీకు అధికారం కట్టబెట్టారా.. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచి పార్లమెంట్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్నారు.
నమ్ముకున్న వారిని మోసం చేయడమే చంద్రబాబు నైజం
నెల్లూరు జిల్లాను నల్లపరెడ్డి కుటుంబం ఎంత అభివృద్ధి చేసిందో ప్రజలందరికీ తెలుసు అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. కోవూరులో మా నాన్న శ్రీనివాసులు రెడ్డిని మూడుసార్లు, మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డిని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.. నెల్లూరు జిల్లాకు తెలుగంగ ప్రాజెక్టును తీసుకువచ్చిన ఘనత మా తండ్రిదే.. మహిళలంటే మాకు చాలా గౌరవం.. నమ్ముకున్న వారిని మోసం చేయడం చంద్రబాబు నైజం అని ఆయన ఆరోపించారు. కోవూరులో మూడు సంవత్సరాల పాటు దినేష్ రెడ్డిని తిప్పారు.. టికెట్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు.. చివరకు మొండి చేయి చూపి ప్రశాంతి రెడ్డికి టికెట్ ఇచ్చారు.. వెంకటగిరిలో కూడా నన్ను ఇదేవిధంగా చంద్రబాబు మోసం చేశారు.. అప్పట్లో నాకు టికెట్ ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో సినీ నటి శారదను రంగంలోకి దించారు అని రాజేంద్ర కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కేటీఆర్, కేసీఆర్ లకు ఇంకా బుద్ధి రావడం లేదు
కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ డమ్మీ క్యాండిడేట్ అని కేటీఆర్ దురహంకారంతో మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. కేటీఆర్ దురహంకారీ,ఆడవాళ్ళు అంటే గౌరవం లేదని, బొజ్జు, సుగుణ లాంటి అనామకులే ఈ రోజు మిమ్మలిని ఓడించారన్నారు. తెలంగాణ ప్రజల త్యాగాల మీద నీకు పదవులు వచ్చాయని, కేటీఆర్, కేసిఆర్ కు ఇంకా బుద్ధి రావడం లేదన్నారు మంత్రి సీతక్క. కేటీఆర్ నీకన్న సుగుణ ఎంతో గొప్ప అని, నోరు జారకు కేటీఆర్ డబ్బు లేనోళ్ళు అనామకులా? అని ఆమె అన్నారు. నీలాగా దోచుకున్న డబ్బు మా దగ్గర లేదని, మీ లెక్క ఫోన్ ట్యాపింగ్ లు చేయాలే అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం లేనోళ్లు రాజకీయం లో రాకూడదా??ఇంత అహంకారమా మీకు?? ప్రాణ త్యాగాలు చేసే పార్టి కాంగ్రెస్ పార్టీ. వాళ్ళేమో ఉన్నోళ్ల పక్షాన ఉన్నారు ..పేదల పక్షాన రాహుల్ గాంధీ ఉన్నారు. 10ఏళ్లుగా బిజెపి ఎం ఇచ్చింది? గుడి గురించి చర్చ చేసే బిజెపి బడులకు ఏం ఇచ్చింది. వందల ఏండ్ల నుండి మతాలు ఉన్నాయి కానీ మతతత్వం లేదన్నారు మంత్రి సీతక్క.
ఎన్నికల ముంగిట జనసేనకు భారీ షాక్.. అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్!!
సరిగ్గా ఇంకా నెల రోజుల్లో 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న లోక్ సభ ఎన్నికలు కూడా అదే రోజు జరగబోతున్నాయి. విడతల వారీగా జరగబోతున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే దాదాపు అన్ని రాష్ట్రాల లో అధికార ప్రతిపక్షాలు హోరాహోరీ పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధికార వైసిపి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిపక్ష టిడిపి పవన్ కళ్యాణ్ జనసేన, బిజెపితో కలిసి కూటమిగా ఏర్పడింది.
మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల
తెలంగాణ ఛత్తీస్గడ్ బార్డర్ లో జరిగిన ఎన్కౌంటర్ పైనా మరో లేఖ ను విడుదల చేశారు మావోయిస్టులు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ నెల 6 వ తేదీన తెలంగాణ ఛత్తీస్ ఘడ్ బార్డర్ లో ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టు మృతి చెందిన ఘటనను తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యాకాండలు నరహంతక దాడిగా అభివర్ణించారు జగన్. ఈ ముగ్గురు హత్యలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఆరోపించిన మావోయిస్టులు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం పిట్టపాడ వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు ఏకపక్ష కాల్పులు జరిపారని ఆరోపణలు ఈ ఘటనను వ్యతిరేకించండని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి ఛత్తీస్గడ్ రాష్ట్రం నుండి కూలీ పనులకు వచ్చిన కూలీలను బెదిరించి కొరియర్లుగా మార్చుకొని వారి సమాచారం తో ముగ్గురు కామ్రేడ్లని ఎన్కౌంటుర్ పేరుతో హత్య చేశారన్న జగన్.. ఈ నెల 6వ తేదీన తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు 5.10 నిమిషాలకు మావోయిస్టులు ఉన్న స్థలాన్ని చుట్టుముట్టి మూకుమూడిగా పోలీసు బలగాలు దాడి చేశాయని ఆరోపించారు. ఈ దాడిలో అమూల్యమైన ప్రజా వీరులు కామ్రేడ్ అన్నే సంతోష్ అలియాస్ సాగర్ శ్రీధర్, ఆప్కా మనీరం, పునేం. లక్ష్మణ్ ముగ్గురు అమరులైయ్యారని తెలిపారు. అమరులైన ముగ్గురు కామ్రేడ్స్ విప్లవ జోహార్లు చెబుతూ వారి ఆశయాలు సాధనకై పోరాడుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మావోయిస్టు అగ్ర నేత జగన్.
రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల.. అందరిలో ఆసక్తి..
లోక్‌సభ ఎన్నికల కోసం రేపు బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికతో పాటు ‘విక్షిత్ భారత్’ రోడ్‌మ్యాప్ ఎన్నికల ఎజెండాలో ప్రముఖంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం ఉంటుందని, దీనికి ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దుతో సహా పలు సైద్ధాంతిక వాగ్దానాలను నెరవేర్చిన బీజేపీ, తన తాజా మేనిఫెస్టోలో ఏ అంశాలను ప్రకటిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. యువత, మహిళలు, రైతులు, పేదలు అనేవి నాలుగు కులానే అని పలు సందర్భాల్లో ప్రస్తావించిన ప్రధాని మోడీ, ఈ మానిఫెస్టోలో వారి కోసం హమీలను ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది.
బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇంటర్మీడియట్ టాపర్‌గా నిలిచింది..
కర్నూల్ జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామానికి చెందిన నిర్మల చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేది. చదువంతా ప్రభుత్వ విద్యాయాల్లోనే కొనసాగించింది. అయితే, ఎంతో పట్టుదలతో చదువుతున్న ఆమె ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్ గా నిలిచింది. ఆలూరు కేజీబీవీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న నిర్మల అత్యధిక మార్కులు తెచ్చుకుంది. బైపీసీలో మొత్తం 440 మార్కులకు గాను 421 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. దీంతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి నిర్మలకు అభినందనలు తెలియజేశారు. కాగా, నిర్మలది నిరుపేద కుటుంబం.. నలుగురు అక్కాచెల్లెల్లలో ఆమె చివరిది. ఆమె తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశారు.. ఇప్పుడు, నిర్మలకు కూడా పెళ్లి చేయాలని అనుకున్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం..
శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి జీవిమాను కూడలిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర బహిరంగ సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబాయిని చంపుకుని ఇతరుల మీద నెట్టి అధికారంలోకి వచ్చిన సైకో జగన్. అలాంటి సైకోని గెలిపించి అనుభవిస్తున్నారు అని ఆరోపించారు. ప్రపంచ దేశాలకే తల మాణికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలోనే లేకుండా చేసిన వ్యక్తి జగన్.. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలకి పేర్లు మార్చుకొని కొనసాగిస్తున్నారు అని ఆయన తెలిపారు. జగన్ సొంత చెల్లిని మోసగించిన వ్యక్తి ఈ విషయం ప్రతి మహిళా గుర్తించి సరైన తీర్పునివ్వాలి.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని బాలకృష్ణ తెలిపారు.
కాంగ్రెస్ తెలంగాణ పార్టీ కాదు
తరిగే పార్టీ, ఇరిగే పార్టీలు మిగతావి, పెరిగే పార్టీ మాత్రం బీజేపీనే అని వ్యాఖ్యానించారు మురళీధర్ రావు. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తెలంగాణ పార్టీ కాదని, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే 50 ఏళ్లుగా ఎందుకు అపారన్నారు. తెలంగాణ కు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశం నడవాలంటే బలమైన నాయకుడు కావాలి.. అది మోడీనే అని ఆయన అన్నారు. ఉగ్ర వాదం ను కాలు కింద వేసి తొక్కిన వ్యక్తి మోడీ అని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ హయం లో నక్సలైట్ల ఉగ్ర వాదం విస్తరించిందన్నారు. బాంబ్ బ్లాస్ట్ లు జరగడం లేదు అంటే దానికి కారణం బీజేపీ అని ఆయన అన్నారు. ముస్లిం కు ఇష్టం ఉన్నట్లు పెళ్ళి చేసుకుంటున్నారు.. పిల్లలు కంటున్నారని, ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసింది మోడీ సర్కార్ అని ఆయన అన్నారు.