దివ్యాంగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. పింఛన్ పెంపు
మంచిర్యాల బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.1000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వచ్చే నెల నుంచి దివ్యాంగులకు రూ.4116 పింఛన్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం దివ్యాంగులకు రూ.3,116 పింఛన్ వస్తోంది. దీంతో సభకు వచ్చిన ప్రజలు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల్లో చక్కటి కలెక్టరేట్లు నిర్మించుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కోసం గతంలో జిల్లా వాసులు ఎన్నో ధర్నాలు చేశారన్న ముఖ్యమంత్రి… జిల్లా కేంద్రాల్లో పని కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఉద్యమ సమయంలో ఏం జరగాలని కోరుకున్నామో అవి క్రమంగా సాధించుకుంటున్నామన్నారు. తాగు, సాగు నీటి సరఫరాలో ఇవాళ తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్న ముఖ్యమంత్రి… ఉచిత విద్యుత్, నిరంతర విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని సీఎం తెలిపారు. అలాగే వరి సాగులో పంజాబ్‌ను కూడా మించిపోయామన్న ఆయన.. యాసంగిలో దేశం మొత్తం కలిపి 94 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు. యాసంగిలో తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని తెలిపారు. ఇప్పటికీ భారత్ వంట నూనెను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. వంట నూనె దిగుమతి తగ్గించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
ధరణి పోతే దళారీ రాజ్యం.. అదంతా దాని వల్లే..
సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వజ్రపుతునకగా ఉన్న సింగరేణిని రెండు పార్టీలు నాశనం పట్టించాయని మండిపడ్డారు. వికలాంగుల ఫించను మరో వెయ్యి పెంచుతున్నామని సీఎం కేసీఆర్ మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేదన సభలో ప్రకటించారు. తెలంగాణలోని కొత్త జిల్లాల్లో చక్కటి కలెక్టరేట్లు నిర్మించుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కోసం గతంలో జిల్లా వాసులు ఎన్నో ధర్నాలు చేశారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా కేంద్రాల్లో పని కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఉద్యమ సమయంలో ఏం జరగాలని కోరుకున్నామో అవి క్రమంగా సాధించుకుంటున్నామన్నారు. తాగు, సాగు నీటి సరఫరాలో ఇవాళ తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, నిరంతర విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని సీఎం తెలిపారు. అలాగే వరి సాగులో పంజాబ్‌ను కూడా మించిపోయామన్న ఆయన.. యాసంగిలో దేశం మొత్తం కలిపి 94 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు. యాసంగిలో తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని తెలిపారు. ఇప్పటికీ భారత్ వంట నూనెను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. వంట నూనె దిగుమతి తగ్గించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ధరణిని బంగళాఖాతంలో వేస్తానని అంటోందని.. ధరణిని వేస్తారా.. రైతులను వేస్తారా అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు రాదన్న సీఎం.. బాధలు వస్తాయన్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగే పాత రాజ్యం వస్తుందన్నారు. పెరిగిన భూముల ధరలకు ధరణి లేకపోతే ఎన్ని హత్యలు జరిగేవని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ధరణి పోతే దళారీ రాజ్యం వస్తుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ధరణిని బంగాళాఖాతంలో కలిపి వేస్తా అన్న వాళ్లను గిరగిర తింపి బంగాళాఖాతంలో వేయాలన్నారు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు.. వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై పలు సందర్భాల్లో కేంద్రం తేల్చేసింది.. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయంగా పేర్కొంది.. అయితే, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదన్న ఆయన.. ప్రత్యేక హోదా అంశం పూర్తయిన అంశం.. ఇంకా దాంట్లో ఏమైన కొరవలు ఉంటే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. శ్రీకాళహస్తిలో రేపు జరగనున్న భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి పరిశీలించిన రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత తొమ్మిళ్లేగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అందించిన సుపరిపాలన ప్రజలకు వివరించేందుకు రాష్ర్టంలోని 26 జిల్లాల్లో ఈ సభలు నిర్వహిస్తున్నాం అన్నారు. ఇక, శ్రీకాళహస్తిలో జరిగే సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే రాష్ర్టంలో ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారని తెలిపారు సోము వీర్రాజు.. ఈ నెల 11వ తేదీన విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు.. అలాగే కేంద్ర మంత్రి మురళీధరన్ మూడు జిల్లాల్లో జరిగే సభల్లో పాల్గొంటారని.. ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అభివృద్ధి వివరిస్తామన్నారు. జూన్ 30వ తేదీ తర్వాత రైతాంగ సమస్యలు, టిడ్కో ఇళ్ళ సమస్యల పై పోరాటం చేస్తామని ప్రకటించారు.. రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామన్నారు సోము వీర్రాజు.
“లవ్ జిహాద్” కేసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆ రాష్ట్ర పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం రాష్ట్రంలోని సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమైన ఆయన ‘‘లవ్ జిహాద్’’పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరాఖండ్ లో విభిన్న మతాలకు చెందిన వారు శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారని.. అయితే లవ్ జిహాద్ వంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. కుట్రలో భాగం ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ప్రజలు ఇప్పుడు ముందుకు వస్తున్నారని సీఎం అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటీవల నమోదైన లవ్ జిహాద్ కేసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలు తెలుసుకునేందుకు సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. లవ్ జిహాద్‌పై అవగాహన పెరుగుతోందని.. అందుకే గత రెండు మూడు నెలలుగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని.. దీనికి తీవ్రమైన మతమార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావడం కూడా ఒక కారణమని ముఖ్యమంత్రి అన్నారు. గత కొన్ని వారాల్లో ఉత్తరకాశీ, చమోలి, హరిద్వార్ జిల్లాల్లో మైనర్ హిందూ బాలికను అపహరించే సంఘటనలు 10కిపైగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో అణ్వాయుధాల మోహరింపు.. పుతిన్ కీలక ప్రకటన
ఏడాదిన్నర గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దం కొలిక్కిరావడం లేదు. యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అణ్వాయుధాల మోహరింపు గురించి కీలక వ్యాఖ్యలుచేశారు. జూలై 7-8 తేదీలలో అన్ని ఏర్పాట్లు సిద్ధమైన తర్వాత రష్యా మిత్రదేశం బెలారస్ లో వ్యూహాత్మక అణ్వాయుధాలు మోహరించడం ప్రారంభిస్తామని శుక్రవారం వెల్లడించారు. ప్రతీది ప్రణాళిక ప్రకారం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా ల్యాండ్ బేస్డ్ స్వల్ప శ్రేణి అణు క్షిపణులను బెలారస్ లో మోహరించే ప్రణాళికను మోహరిస్తుందని గతం కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. బెలారస్ ఉక్రెయిన్ యుద్ధంలో చాలా కీలకంగా ఉంటుందని రష్యా భావిస్తోంది. ఉక్రెయిన్ ను అనుకుని బెలారస్ ఉండటం రష్యాకు కలిసి వస్తుంది. ముఖ్యంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో రష్యాకు అన్నివిధాలుగా సహకరిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ లో నోవా కకోవ్కా డ్యామ్ పై దాడి తర్వాత ఉక్రెయిన్ లోని ఖేర్సన్ నగరం పూర్తిగా జలమయం అయింది. డ్యామ్ పై దాడి రష్యా పనే అని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే వేలాది మంది వరదల కారణంగా నిరాశ్రయులు అయ్యారు. మరోవైపు నీటిలో కొట్టుకువస్తున్న ల్యాండ్ మైన్స్ వల్ల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో అని భయపడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రజల తరలింపును వేగం చేసింది. అధ్యక్షుడు జెలన్ స్కీ వరద ప్రాంతాల్లో పర్యటించారు.
వేపతో అన్నీ ప్రయోజనాలా.. రోజు మీరు తినండి..!
వేప ద్వారా మనకు ఎన్ని ప్రయోజనాలున్నాయో చెప్పక్కర్లేదు. పల్లెటూర్లళ్లైతే పొద్దున లేవగానే వారి పండ్లు తోముకోవడానికి వేప పుల్లను వాడుతారు. దాని కాండం నుంచి మొదలు పెడితే వేర్లు, చిగుళ్లు, విత్తనాలు వరకు ఆరోగ్యానికి మేలు చేసేవిగా ఉంటాయి. వేప చేదుగా ఉన్నా.. దానిలో మాత్రం ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. వేప అద్భుతమైన శీతలీకరణ ఏజెంట్. ఇది హైపర్ అసీడిటీ, మూత్ర మార్గ రుగ్మతలు, చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వేప ఆకులతో ఎన్నో ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యల నుంచి బయటపడొచ్చు. వేపాకులతో ముఖ్యంగా పిత్తాన్ని సమతుల్యం చేయడంతో పాటు.. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే వేపతో మానవుని జీర్ణక్రియ మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలసట, దగ్గు, దాహం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. పల్లెటూర్లలో దెబ్బతగిలితే వెంటనే వేపాకు రసాన్ని గాయంపై పోస్తారు. దాని వల్ల ఆ గాయం శుభ్రమౌతుంది. తొందరగా నయం అయ్యేందుకు సహాయపడుతుంది. అలాగే వేప ఆకులు వికారం, వాంతుల నుంచి రిలీఫ్ కలిగిస్తుంది. అలాగే శరీరంలో మంటను తగ్గించేందుకు కూడా సహాయపడుతుందని వైద్యపరంగా నిరూపించబడింది. వేప ఆకులను వేడినీటిలో మరిగించి స్నానం చేస్తే చాలా మంచింది. దానివల్ల చుండ్రు, తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా జుట్టు కూడా షైనీగా మారిపోతుంది. మనకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు.. వేపనీటి కషాయం తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. వేపతో మధుమేహం, చర్మవ్యాధులు, జ్వరం, రోగనిరోధక శక్తి, జ్వరాలు మొదలైన సమస్యల చికిత్సకు ఉపయోగించొచ్చు. అంటే మాత్రలు, పౌడర్లు, జ్యూసుల రూపంలో తీసుకోవచ్చు. అయితే ఇది రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
పెళ్లి కూతురు కనిపించిదిరోయ్.. మెగా కోడలు మస్త్ ఉందిగా
హీరోయిన్ లావణ్య త్రిపాఠి లక్కీ ఛాన్స్ పట్టేసింది. ఎట్టకేలకు తన ప్రేమను పెళ్లి పీటలు వరకు తెచ్చుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య నిశ్చితార్థం మరికొద్దిసేపటిలో మొదలుకానుంది. మణికొండ లోని పామ్ బ్రీజ్ గెడెడ్ కమ్యూనిటీలోని నాగబాబు ఇంట ఈ వేడుక జరగుతుంది. మెగా ఫ్యామిలీ, అతికొద్దిమంది బంధువుల మధ్య ఈ నిశ్చితార్థం జరగనుంది. అయితే ఈ ఎంగేజ్ మెంట్ గురించి మెగా ఫ్యామిలీ కానీ, లావణ్య ఫ్యామిలీ కానీ బయటపడిందే లేదు. పీఆర్ టీమ్ ల ద్వారా ఇన్విటేషన్ బయటకు వచ్చిందే తప్ప మెగా కుటుంబం అధికారికంగా చెప్పింది లేదు. అసలు అది నిజమో కాదో అని అభిమానులు ఇంకా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు అది నిజమే అన్న కన్ఫర్మేషన్ వచ్చేసింది. పెళ్లికూతురు.. మెగా ఇంట అడుగుపెట్టింది. నిండైన చీరకట్టుతో.. తలనిండా మల్లెపూలతో అమ్మడు మెరిసిపోయింది. కారులో మెగా ఇంట అడుగుపెడుతున్న లావణ్య ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సాయంత్రం 7 గం.ల నుండి 8 గంటల మధ్య నిశ్చితార్థ అంగుళీక ధారణ కు దివ్య ముహూర్తాన్ని ఫిక్స్ చేశారట. ఈ ఎంగేజ్ మెంట్ కు మెగా ఫ్యామిలీ ఇప్పటికే వరుణ్ ఇంటికి చేరుకుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ అంజనాదేవి, అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్, ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా ఉపాసన సైతం ఎంగేజ్ మెంట్ కు హాజరయ్యింది. ఈ నిశ్చితార్థం అయ్యాకా వరుణ్- లావణ్య మీడియాకు ఫోటోలను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక వరుణ్, లావణ్య క్లోజ్ ఫ్రెండ్ తప్ప బయటవారెవ్వరు కూడా లోపలి అనుమతి లేదని టాక్. ఇక వీరి ఎంగేజ్ మెంట్ ఫోటో ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
బాలయ్య తో సినిమా నాకు లైఫ్ లో గుర్తుండి పోతుంది..!!
నట సింహం బాలకృష్ణ. ఈయన అఖండ మరియు వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ సినిమా ”భగవంత్ కేసరి”.ఈ సినిమా టైటిల్ ను ఎంతో గ్రాండ్ గా అనౌన్స్ చేసారు.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూట్ ఎక్కువ భాగం పూర్తి అయినట్లు సమాచారం.బాలకృష్ణ జూన్ 10న తన పుట్టిన రోజు సందర్బంగా భారీ ట్రీట్ ను సిద్ధం చేసారు మేకర్స్.. ఇప్పటికే టైటిల్ ప్రకటించి ఎంతో హైప్ పెంచేయగా.. రేపు బర్త్ డే రోజు టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య మాస్ మంత్ర సాంగ్ ను బాలయ్య అభిమానుల తో కలిసి అనిల్ రావిపూడి లాంచ్ చేసారు. ఈ సందర్భం గా అనిల్ రావిపూడి మాట్లాడారు.ఈయన మాట్లాడుతూ.. బాలయ్య గారు నటించిన సినిమాల ను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను.. తొలిసారిగా ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం రావడం నాకు సంతోషం గా ఉందని.. సెట్స్ లో బాలయ్య ప్రతీ ఒక్కరికి ఎంతో రెస్పెక్ట్ ను ఇస్తారని.. ఆయనతో వర్క్ చేసిన తర్వాత ఆయన మీద ఉన్న అభిమానం, గౌరవం ఇంకా పెరిగాయని అనిల్ తెలిపారు. అలాగే భగవంత్ కేసరి సినిమా తన కెరీర్ ఎంతో స్పెషల్ గా ఉంటుందని.. భగవంత్ కేసరి సినిమా తనకు మాత్రమే కాకుండా బాలయ్య గారి ఫ్యాన్స్ కు కూడా ఎంతో స్పెషల్ గా నిలిచి పోతుంది అని విడుదల తర్వాత తప్పకుండ ఈ సినిమా అందరిని బాగా ఆకట్టుకుంటుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పారు అనిల్.. మరి రేపు టీజర్ ఎలా ఉంటుందో.. ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. రేపు బాలయ్య ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ఉంటుంది అని అనిల్ తెలిపినట్లు సమాచారం.ట్రైలర్ కచ్చితంగా అందరిని అలరిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.
అందరు అయిపోయారు.. ఇప్పుడు కన్నడ డైరెక్టర్ తోనా మాస్టారు
గత కొన్నేళ్లుగా గోపీచంద్.. టాలీవుడ్ పై ఒక యుద్ధమే ప్రకటించాడు. యుద్ధంలో గెలుపు వచ్చేవరకు ఎలా పోరాడుతారో.. మనోడు కూడా హిట్ వచ్చేవరకు పోరాడుతూనే ఉంటున్నాడు. ఇక ఈ మధ్యనే వచ్చిన రామబాణం కూడా మిస్ ఫైర్ అయిన విషయం తెల్సిందే. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరో కొత్త సినిమాను లైన్లో పెట్టాడు. ఇప్పటివరకు గోపీచంద్.. తెలుగు, తమిళ్ దర్శకులతో కలిసి పనిచేశాడు. తనకు అచ్చివచ్చిన డైరెక్టర్స్.. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ అందరితోనూ పనిచేశాడు. అయినా హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి కన్నడ డైరెక్టర్ ను నమ్ముకున్నాడు గోపిచంద్. తాజాగా వీరి సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో వేద లాంటి యాక్షన్ సినిమా ను తెరకెక్కించి హిట్ అందుకున్న హర్ష దర్శకత్వంలో గోపీచంద్ 31 వ సినిమా తెరకెక్కనుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక కెజిఎఫ్ కు సంగీతం అందించిన రవి బసూర్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పోరు ఫుల్ అప్డేట్ ను జూన్ 12 న రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆరోజు గోపీచంద్ బర్త్ డే కావడంతో.. ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. పోస్టర్ ను కానీ, టైటిల్ ను కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇక తెలుగు, తమిళ్ డైరెక్టర్ లు అయిపోయారు.. ఇప్పుడు కన్నడ డైరెక్టర్ తోనా మాస్టారు.. ఏది అయితే ఏం.. సినిమా హిట్ అయితే చాలు.. కంగ్రాట్స్ అంటూ గోపీచంద్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈసారి గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.