చంద్రబాబు అరెస్ట్.. ఉద్రిక్తత..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ పోలీసులు.. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీసు ఇచ్చారు సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు చెబుతున్నారు.. చంద్రబాబు బాబుపై 120(బీ), 166, 167,418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.. అయితే, ఎఫ్‌ఐఆర్ లేదు.. నోటీసు లేదు.. ఏదో జరిగిందని కేసులు పెడుతున్నారు.. స్కిల్ స్కామ్ కేసులో నా పేరు ఎక్కడ ఉందో చూపించండి.. ప్రాథమిక ఆధారాలు లేకుండా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ అధికారులను నిలదీశారు చంద్రబాబు.. ఇక, విజయవాడ మూడో ACM కోర్టుకు చంద్రబాబును తరలించే అవకాశం ఉంది.. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.. టీడీపీ నాయకులు బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు.
రాష్ట్రవ్యాప్తంగా బంద్.. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది సీఐడీ.. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీసు ఇచ్చారు సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు చెబుతున్నారు.. చంద్రబాబు బాబుపై 120(బీ), 166, 167,418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.. మరోవైపు ఇదే కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కొడుకును కూడా అరెస్ట్ చేశారు.. చంద్రబాబుతో కలిసి APSSDCని ఏర్పాటు చేసిన ఆరోపణలపై గంటాను అరెస్ట్ చేశారు.. ఇక, చంద్రబాబు అరెస్ట్‌తో ఎలాంటి ఆందోళనలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా బంద్ వాతావరణం నెలకొంది.. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు.. ఆర్టీసీ బస్సులు రోడ్లపై కనిపించడం లేదు.. రాష్ట్ర వ్యాప్తంగా డిపోలకే పరిమితం అయ్యాయి ఆర్టీసీ బస్సులు.
తెలంగాణలో మరో రెండ్రోజులు వానలు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు, నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని చెబుతున్నారు. ఇవి నేటి నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి ఈశాన్య రుతుపవనాల రాక ముందుగానే ప్రారంభం కావచ్చని IMD అంచనా వేసింది.
ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వారం పాటు 16 సర్వీసులు రద్దు
హైదరాబాద్‌లోని MMTS రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక. దక్షిణ మధ్య రైల్వే అధికారులు వారం పాటు 16 సర్వీసులను రద్దు చేశారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు 16 సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. వాజానగర్ నుండి లింగంపల్లికి వెళ్లే రైలు నంబర్ 47165 సమయం మార్చబడింది. ఈ రైలు ఈ వారం వాజా నగర్ నుండి ఉదయం 8.50 గంటలకు బయలుదేరుతుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. రద్దు చేసిన ఎంఎంటీఎస్ సర్వీసుల్లో హైదరాబాద్-లింగంపల్లి మధ్య 10 రైళ్లు నడుస్తున్నాయి. లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య నడిచే మూడు రైళ్లు, వాజానగర్-లింగంపల్లి మధ్య నడిచే మూడు రైళ్లను రద్దు చేశారు. MMTS స్టేషన్లలో రద్దు చేయబడిన రైళ్ల సమయాలు మరియు క్యారేజీ నంబర్లను ప్రదర్శిస్తామని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సిహెచ్ రాకేష్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు బిడెన్, మోడీ సమావేశం.. రక్షణ, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందం
జీ20 సదస్సులో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోడీ అధ్యక్షుడు బిడెన్‌కు ప్రైవేట్‌గా విందు కూడా ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ బిడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటిసారిగా భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన అధ్యక్షుడు జో బిడెన్ పలు అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరుదేశాల అధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారతదేశం-అమెరికా సమగ్ర గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌ను మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు బిడెన్ తన దార్శనికత, నిబద్ధత కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువలు, వ్యూహాత్మక కలయికలు, బలమైన వ్యక్తుల మధ్య సంబంధాలపై ఆయన నొక్కి చెప్పారు. ప్రధాని మోడీ చారిత్రాత్మక అమెరికా పర్యటనలో సమగ్ర ఫలితాలను అమలు చేయడంలో పురోగతిని సమావేశం ప్రశంసించింది. ప్రధాని జూన్ పర్యటన సందర్భంగా భారత్-అమెరికా సహకారం ఊపందుకుంది. ఉమ్మడి ప్రకటనలో, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, ఆరోగ్యం, పరిశోధన, ఆవిష్కరణలు, సంస్కృతి మరియు ప్రజల మధ్య సంబంధాలతో సహా ద్వైపాక్షిక సహకారంలో కొనసాగుతున్న వేగాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. మిషన్ చంద్రయాన్‌కు అధ్యక్షుడు బిడెన్ అభినందనలు తెలిపారు.
సెప్టెంబర్ 10 వరకు ఢిల్లీలో ఆంక్షలు.. ఏవి ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే?
జీ20 సదస్సు తొలి సమావేశం శనివారం జరగనుంది. పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఢిల్లీ చేరుకున్నారు. బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది నాయకులు అంతకుముందు రోజు దేశ రాజధానికి హాజరయ్యారు. ఈ వ్యక్తులు ఢిల్లీకి వచ్చిన తరువాత, భద్రతకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకున్నారు. దీని కారణంగా ఢిల్లీ వాసులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సుప్రీం కోర్ట్ స్టేషన్ కాకుండా అన్ని మెట్రో స్టేషన్లు సాధారణంగా నడుస్తాయి. అయితే చాలా స్టేషన్లలో కొన్ని ఎంట్రీ-ఎగ్జిట్ గేట్లు మూసివేయబడతాయి. IGI విమానాశ్రయం, ధౌలా కువాన్, సౌత్ క్యాంపస్, ఖాన్ మార్కెట్, జన్‌పథ్, కైలాష్ కాలనీ, మూల్‌చంద్, సుప్రీం కోర్ట్ (పూర్తిగా మూసివేయబడింది), బరాఖంబ రోడ్, ఆశ్రమం, IIT, హౌజ్ ఖాస్, సెంట్రల్ సెక్రటేరియట్, లోక్ కళ్యాణ్ మార్గ్, ITO, చాందినీ చౌక్ మొదలైనవి. మరోవైపు, సుప్రీంకోర్టు, పటేల్ చౌక్, ఆర్‌కె ఆశ్రమ్ మార్గ్ మెట్రో స్టేషన్‌ల పార్కింగ్ సెప్టెంబర్ 8 ఉదయం 4 గంటల నుండి సెప్టెంబర్ 11 మధ్యాహ్నం వరకు మూసివేయబడుతుంది. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (NDMC) ప్రాంతంలో అన్ని పాఠశాలలు-కళాశాలలు, ప్రభుత్వ-ప్రభుత్వేతర కార్యాలయాలు, దుకాణాలు మూసివేయబడతాయి. తపాలా, వైద్య సేవలు, పాథలాజికల్ ల్యాబ్‌ల వంటి ముఖ్యమైన సేవలు ఢిల్లీ అంతటా నమూనా సేకరణకు అనుమతించబడతాయి. వైద్య సదుపాయాలపై ఎలాంటి పరిమితి లేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇండియా గేట్, డ్యూటీ పాత్ ప్రాంతానికి వెళ్లడం నిషేధించబడింది. వాకింగ్, సైక్లింగ్ లేదా పిక్నిక్ కోసం ఇండియా గేట్, డ్యూటీ పాత్‌లకు వెళ్లవద్దని ఈ ప్రాంతాల్లోని పోలీసులు ప్రజలను కోరారు. న్యూ ఢిల్లీ జిల్లాలో వాహనాల రాకపోకలు నియంత్రించబడుతున్నాయి. అయితే అంబులెన్స్‌లు, స్థానికులు, ఈ ప్రాంతంలో నివసించే పర్యాటకులు సరైన గుర్తింపు కార్డులతో ప్రయాణించడానికి అనుమతించబడతారు.
ల్యాప్ ట్యాప్ ను షట్ డౌన్ చేయకుండా క్లోజ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే
ప్రస్తుతం ఎక్కడ చూసిన మొబైల్ ఫోన్ లు, ల్యాప్ ట్యాప్ లు కామన్ అయిపోయాయి. మళ్లీ సాఫ్ట్ వేర్ బూమ్ విపరీతంగా పెరగడం, ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు విరివిగా లభించడంతో చాలా మంది ఈ జాబ్స్ చేస్తున్నారు. ఇక కరోనా పుణ్యమా అని చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నారు. దాంతో ఇంటి నుంచే ఎంతో సులభంగా ఉద్యోగం చేసుకుంటున్నారు. తమకు అనకూలమైన సమయంలో తమ ప్రాజెక్ట్ సంబంధించిన పనులు చేస్తున్నారు. అయితే ఇక్కడే కొంత మంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. వారు చేసే చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. ల్యాప్ ట్యాప్ విషయంలో జాగ్రత్త అవసరం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొంత మంది ల్యాప్ ట్యాప్ ను షట్ డౌన్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాయి. అయితే అలా చేస్తే ఒక్కో సారి ల్యాప్ ట్యాప్ పేలే అవకాశం ఉంటుంది. అందుకే ల్యాప్ ట్యాప్ ఉపయోగించడం అయిపోగానే దానిని షట్ డౌన్ చేయాలి లేదా కొద్దిసేపటి తరువాత మళ్లీ ఉపయోగించాలనుకుంటే స్లీప్ మోడ్ లో పెట్టాలి. అయితే అలా పెట్టని ఓ వ్యక్తి ల్యాప్ ట్యాప్ పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కనీసం సమాధానం చెప్పే తీరిక కూడా లేకుండా పోయింది…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. ఈ రెబల్ స్టార్ నుంచి సినిమా వస్తుంది అంటే టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ అవుతాయి, కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అయినా ప్రభాస్ మార్కెట్ చెక్కు చెదరలేదు, అందుకే ప్రభాస్ ని ఈ జనరేషన్ చూసిన ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో అంటారు. ఇలాంటి ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ సినిమా చేసాడు. ఈ ఫ్రాంచైజ్ నుంచి పార్ట్ 1, సీజ్ ఫైర్ సినిమా సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రావాల్సి ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో సలార్ ట్రైలర్ బయటకి వస్తుంది, ఈ ట్రైలర్ క్రియేట్ చేసే హైప్ తో సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ షేప్ షకల్ మార్చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. ఇంతలో సలార్ వాయిదా అనే వార్త బయటకి వచ్చింది. ఇది అఫీషియల్ గా వచ్చిన వార్తనా లేక రూమర్ మాత్రమేనా అనేది తెలుసుకోవడానికే ఫ్యాన్స్ కి రెండు రోజుల సమయం పట్టింది. ఇప్పటికీ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ వాయిదా పడింది అంటే నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ఒక్క సినిమా వాయిదా వేయడం వలన అన్ని భాషల్లో సినిమాల రిలీజ్ డేట్స్ మారిపోవాల్సి వచ్చింది. కొన్ని సినిమాలు వెనక్కి, మరి కొన్ని సినిమా ముందుకి వచ్చి సెప్టెంబర్ 28న తమ సినిమాలని రిలీజ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. సలార్ మేకర్స్ నుంచి ఇప్పటికీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రాలేదు. సినిమా వాయిదా వేసాం, త్వరలో కొత్త డేట్ తో వస్తాం అనే మాటే చెప్పడం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ని దర్శక నిర్మాతలు తీసుకునే అంత గ్రాంటెడ్ గా ఎవరు తీసుకోరు, ఇదే ఇతర హీరోల అభిమానులు అయి ఉంటే ఈ పాటికి ప్రొడక్షన్ హౌజ్ పైన హ్యూజ్ నెగటివ్ ట్రెండ్ ని చేసే వాళ్లు. మేకర్స్ ఇప్పటికైనా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది.
తమిళ డైరెక్టర్-హీరోయిన్-విలన్-మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా… కలెక్షన్స్ మాత్రం తెలుగులోనే ఎక్కువ
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కి రఫ్ఫాడిస్తుంది. మిడ్ వీక్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు 129 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. 2023లో సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ ఫిల్మ్ గా జవాన్ నిలిచింది. మొదటి ప్లేస్ లో ఆదిపురుష్ సినిమా ఉంది. జవాన్ మూవీకి నార్త్ బెల్ట్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, సౌత్ లో హిట్ టాక్ ఉంది కానీ మనకి అలవాటు అయిపోయిన ఫక్తు కమర్షియల్ డ్రామా కావడంతో రెగ్యులర్ ఫీల్ రావడం గ్యారెంటీ. అయితే ఒక తమిళ దర్శకుడు, తమిళ హీరోనే, తమిళ విలన్, తమిళ మ్యూజిక్ డైరెక్టర్, తమిళ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఉన్న జవాన్ సినిమాకి… తమిళనాడులో కన్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్స్ వస్తుండడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో జవాన్ సినిమా ఇప్పటివరకున్న అన్ని బాలీవుడ్ సినిమాల రికార్డులని బ్రేక్ చేసింది. పది కోట్లు రాబట్టిన జవాన్ సినిమా స్ట్రాంగ్ వీకెండ్ కి టార్గెట్ చేస్తుంది. మండే స్టార్ట్ అయ్యే సమయానికి జవాన్ మూవీ ఇప్పుడున్న కలెక్షన్స్ కన్నా డబుల్ రాబట్టడం పక్కా. తమిళనాడులో జవాన్ సినిమా పర్వాలేదులే అనిపించేలా కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇక్కడ నయనతార, అనిరుద్, విజయ్ సేతుపతి, అట్లీలకి ఉన్న ఇమేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా జవాన్ సినిమా కలెక్షన్స్ ని పెంచలేకపోయింది. తమిళ్ కన్నా తెలుగులో కలెక్షన్స్ ఎక్కువ ఉండడంతో… హిందీ హీరో, తమిళ కాస్ట్ అండ్ క్రూ అయినా కూడా మేము సినిమా చూసి ఆదరిస్తాం, అది మాకు సినిమాపై ఉన్న ప్రేమ… అందుకే వరల్డ్ లో మాకంటే గొప్ప సినిమా ప్రేమికులు ఉండరు అంటూ కొందరు తెలుగు యూత్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.