తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10 వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాల అదనపు గ్రేస్ టైమ్ ఇచ్చారు. ఈ ఐదు నిమిషాల గ్రేడ్ టైం ఏపీ విద్యార్థులకు వర్తించదు కేవలం.. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఐదు నిమిషాల గ్రేట్ టైమ్ ఇస్తున్నట్లు తెలిసింది. అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. విద్యార్థులు కాగితాలు, ఇతర పత్రాలు తమ వెంట తీసుకెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. అవకతవకలకు పాల్పడితే డిబార్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. SCSC పరీక్షల అభ్యర్థులకు RTC అన్ని తెలుగు రాష్ట్రాలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పించారు. సెలవు రోజుల్లో కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. కాంబినేషన్ టికెట్ తో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చని వెల్లడించారు.
NTPC రెండో యూనిట్‌లో సాంకేతిక లోపం
అనకాపల్లి జిల్లా సింహాద్రి NTPC లో సాంకేతిక లోపం తలెత్తింది.. NTPCలోని రెండో యునిట్‌లో సాంకేతిక లోపం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు… బాయిలర్ ట్యూబ్ కు రంధ్రం పడటంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.. అయితే, సాంకేతిక సమస్యన పునరుద్ధరణ సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. ఎన్టీపీసీలో ఏర్పడిన సాంకేతిక సమస్య పునరుద్ధరణకు మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు ప్రస్తుతం మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కాగా, సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్.. విశాఖ శివారు ప్రాంతంలో ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం.. ఇది భారత ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ చే నిర్వహించబడుతుంది. ఎన్టీపీసీ యొక్క బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలలో ఈ విద్యుత్ కేంద్రం ఒకటి. పవర్ ప్లాంట్ కోసం బొగ్గును ఒడిశాలోని తాల్చేర్ బొగ్గు గనులలోని కళింగ బ్లాక్ సమకూరుస్తారు.. ఈ ప్లాంట్ ఆస్తి, నిర్వహణ జాతీయ స్థాయిలో ఉంటుంది.. ఇక, విద్యుత్ బహుళ రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం చేయబడుతుంది. యూనిట్లు 1, 2 ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్, 1,000 మెగావాట్ల వరకు ఉత్పత్తి చేయబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ సంస్థలకు అందించబడుతుంది. ఇక, 3, 4 యూనిట్లలో ఉత్పత్తి చేయబడిన మరో 1,000 మెగావాట్ల విద్యుత్ ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాలకు కేటాయిస్తూ వస్తున్నారు.
హైవేపై ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. నేడు కొరిశపాడు-రేణింగవరం మధ్య ట్రయల్ రన్
విమానాలను ల్యాండ్ చేయాలంటే చివరకు అత్యవసరంగా దించాలన్నా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సిందే.. కానీ, కొన్ని పరిస్థితుల్లో జాతీయ రహదారులపై దించేసే ఎలా ఉంటుంది? దీనికి సంబంధించిన ట్రయల్ రన్‌కు సిద్ధం అయ్యారు అధికారులు.. హైవేలపై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ఈ రోజు ఏపీలో నిర్వహించనున్నారు.. కొరిశపాడు – రేణింగవరం మధ్య జాతీయ రహదారిపై ఈ హైవే రన్‌వేపై విమానాల ల్యాండింగ్‌కు ఎయిర్ ఫోర్స్, హైవే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. అత్యవసర పరిస్థితుల్లో విమానాలను దించే విధంగా.. దేశవ్యాప్తంగా 13 రన్‌వేలను జాతీయ రహదారులను సిద్ధం చేస్తున్నారు.. వీటికోసం.. హైవే అథారిటీ 79 కోట్ల రూపాయలతో 4.1 కిలోమీటర్ల పొడవైన రహదారిని ప్రత్యేకంగా నిర్మించింది.. ఈ రోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య హైవేపై విమానాలు దిగనున్నాయి.. ఇక, ఈ సందర్భంగా హైవే పై వెళ్లే వాహనాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దారి మళ్లించి.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జాతీయ రహదారులపైనే విమానాలు ఎమర్జెన్సీ ల్యాండ్ చేసే విధంగా ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి.
నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త..! మరి ఈడీ విచారణకు..?
ఎమ్మెల్సీ కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త అనిల్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఈడీ ఆమెను అక్రమంగా అరెస్టు చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నారు. ఈ నెల 19న కవితపై కేసు విచారణ జరగనుందని, ఆమెను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఇది గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. కాగా, ఆదివారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను విచారించారు. విచారణలో ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చినట్లు సమాచారం. విచారణను అధికారులు వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆమె భర్త అనిల్, న్యాయవాది మోహిత్‌రావు కవితను కలిశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఆరోపణలుగానే మిగిలిపోతాయని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పినట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్సీ కవిత సమీప బంధువులు, ఆమె వ్యక్తిగత సిబ్బంది కొందరు సోమవారం ఆమెను కలిసే అవకాశం ఉంది. మరోవైపు కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. అనిల్ తోపాటు.. కవిత పీఆర్వో రాజేష్, ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులిచ్చింది. ఇవాళ హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. మరి అనిల్ హాజరు అవుతారా? అనేది దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
పెళ్లి ఊరేగింపు కారు.. ట్రాక్టర్ ఢీ.. ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి
బీహార్ నుంచి పెద్ద వార్త బయటకు వస్తోంది. ఖగారియా జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. పెళ్లికి వచ్చిన అతిథులతో నిండిన ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. NH-31లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రిలో చేర్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లి ఊరేగింపు చౌతం బ్లాక్ నుండి తిరిగి వస్తోంది. ఈ మొత్తం ఘటన పస్రాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యారత్న పెట్రోల్ పంప్ సమీపంలో నమోదవుతోంది.
మాల్దీవులలో ఎన్నికలు.. భారత్‌లో బ్యాలెట్ బాక్స్‌లు?.. విషయం ఏంటంటే?
మాల్దీవుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను భారత్, శ్రీలంక,మలేషియాలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది. సుమారు 11,000 మంది మాల్దీవులకు చెందినవారు తమ పోలింగ్ స్టేషన్‌లను తరలించడానికి రీ-రిజిస్ట్రేషన్ అభ్యర్థనలు సమర్పించారని ఆ దేశ ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఏప్రిల్ 21న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం శనివారం కోరింది. మాల్దీవుల ఎన్నికల బ్యాలెట్ బాక్సులను కేరళ రాజధాని తిరువనంతపురం, శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని కౌలాలంపూర్‌లో కూడా ఉంచుతామని ఎన్నికల కమిషన్ తెలిపింది. మూడు దేశాల్లో కనీసం బ్యాలెట్ బాక్స్ పెట్టేందుకు అవసరమైన ఓటర్ల తమ పేరును నమోదు చేసుకున్నారని పేర్కొంది. ఇతర దేశాల్లో నివసిస్తున్న పౌరుల కోసం రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించబడిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. వెబ్ పోర్టల్ ‘Adadhu.com’ ప్రకారం, ఎన్నికల కమిషన్ సెక్రటరీ జనరల్ హసన్ జకారియా మాట్లాడుతూ.. “గతంలో లాగా, శ్రీలంక, మలేషియాలో చాలా మంది నమోదు చేసుకున్నారు. భారతదేశంలోని తిరువనంతపురంలో 150 మంది నమోదు చేసుకున్నారు, కాబట్టి మేము అక్కడ బ్యాలెట్ పెట్టెను ఉంచాలని నిర్ణయించుకున్నాము.” అని తెలిపారు.
రష్యాలో ఏకపక్ష విజయం.. చైనా, దేశద్రోహులపై కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్
రష్యా అధికారం మళ్లీ వ్లాదిమిర్ పుతిన్ చేతుల్లోకి వచ్చింది. మరోసారి రష్యాను పుతిన్ పాలించనున్నారు. ఆదివారం జరిగిన రష్యా ఎన్నికల్లో పుతిన్ రికార్డు విజయం సాధించారు. దాదాపు 88 శాతం ఓట్లు సాధించి అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ మరోసారి తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఇది ఐదోసారి. 2030 వరకు రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు. 1999లో రష్యాలో అధికార పగ్గాలను వ్లాదిమిర్ పుతిన్‌కు అప్పగించారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఎన్నికల్లో ఓడిపోలేదు. రికార్డు విజయం సాధించిన అనంతరం రష్యా ప్రజలకు, ఉక్రెయిన్‌లో పోరాడుతున్న సైనికులకు వ్లాదిమిర్ పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. రష్యాను బెదిరించడం గానీ, అణచివేయడం గానీ సాధ్యం కాదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఓటింగ్ ఫలితాలు తన నాయకత్వంపై రష్యా పౌరుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. రష్యా ప్రజలు ఆయనను విశ్వసిస్తున్నారని ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఎలాంటి భయం లేకుండా, నిస్వార్థంగా దేశాన్ని కాపాడుతున్న రష్యా యోధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పరుగులు పెడుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో అయితే గోల్డ్ రేట్లు బాగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 66 వేలకు చేరుకుంది. అయితే వరుసగా పెరుగుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు కనబడుతోంది. గత 4-5 రోజులుగా స్వల్పంగా తగ్గడం లేదా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (మార్చి 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,580గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.66,090గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.10.. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గింది. మరోవైపు నేడు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.100 తగ్గి.. రూ.77,200లుగా ఉంది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,200గా ఉంది. ముంబైలో రూ.77,200 ఉండగా.. చెన్నైలో రూ.80,200గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,200లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,000గా ఉంది.
డబ్ల్యూపీఎల్ 2024 విజేత ప్రైజ్‌మనీ ఎంతంటే?.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఎవరికంటే!
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ చేరిన తొలిసారే ఆర్‌సీబీ టైటిల్‌ను దక్కించుకుంది. దాంతో ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ కల ఎట్టకేలకు నేరవేరింది. గత 16 ఏళ్లగా ఐపీఎల్‌లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ కలను డబ్ల్యూపీఎల్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. తొలి టైటిల్ అందడంతో ఆర్‌సీబీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. డబ్ల్యూపీఎల్ 2024 ఛాంపియన్స్‌గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రూ.6 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ.3 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. ఇక ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆర్‌సీబీ స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ ‘ఆరెంజ్ క్యాప్’ (9 మ్యాచ్‌లలో 347 పరుగులు ) అందుకున్నారు. ఆమెకు రూ.5 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన ఆర్‌సీబీ స్పిన్నర్ శ్రేయంక పాటిల్ ‘పర్పుల్ క్యాప్’ (9 మ్యాచ్‌లలో 13 వికెట్లు) హోల్డర్‌గా నిలిచింది. ఆమెకు రూ.5 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.
సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు!
ప్రముఖ సింగర్ మంగ్లీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో మంగ్లీకి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. శంషాబాద్ పోలీసుల వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదేరోజు అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో హైదరాబాద్-బెంగళూర్ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషాబాద్ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే.. కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది.
రజాకార్ మూవీ డైరెక్టర్ ఓ యాంకర్ భర్త అని తెలుసా?
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అవుతున్న మూవీ రజాకార్.. ఈ సినిమా తెలంగాణా చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను అందుకున్న ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ సినిమా కథకు జనాలు ఫిదా అయ్యారు.. మొదటి షోతోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.. ఈ సినిమా డైరెక్టర్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. నిజాం పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు.. కొన్ని వర్గాల వారికి సినిమా నచ్చక పోయిన చాలా మంది ప్రజలు ఈ సినిమాకు బ్రాహ్మరథం పడుతున్నారు.. ఇకపోతే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. ఈ సినిమా డైరెక్టర్ యాట సత్యనారాయణ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈయన సినిమాలు చెయ్యక ముందు సీరియల్స్ కు డైరెక్టర్ గా వ్యవహారించారు.. అయితే ఈయన రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలో రాజమౌళి కూడా అక్కడే వర్క్ చేశారట. అలాగే హీరో నాని కూడా తనకు తెలుసని, కానీ నాని స్టార్ హీరో అయ్యాక మాట్లాడలేదని చెప్పాడు.. అయితే ఈయన ఓ స్టార్ యాంకర్ భర్త కూడా.. యాంకర్ మాత్రమే కాదు, సీరియల్స్ నటి కూడా.. ఆమె ఎవరో కాదు నవీన..సీరియల్స్ లో చేసే సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం పెళ్ళి వరకు వెళ్లిందట.. ఇక ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది.. నటి శ్రీవాణి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటారు..