సీఎం జగన్ వరుస సమీక్షలు.. సాయంత్రం తిరుపతికి ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు బిజీగా గడపనున్నారు.. వరుస సమీక్షలతో పాటు.. ఈ రోజు సాయంత్రం తిరుపతి పర్యటనకు వెళ్లనున్నారు సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేడు ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించనున్న ఆయన.. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల జారీతో పాటు.. ధాన్యం సేకరణపై అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు ఏపీ సీఎం. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శ్రీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ నెల 18వ తేదీ నుంచి ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ కొత్త కార్డులు, ఆరోగ్య శ్రీ డ్రైవ్ పై ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమావేశమై.. ఆరోగ్యశ్రీ కార్డుల జారీతో పాటు స్పెషల్ డ్రైవ్‌పై చర్చించనున్నారు.. ఇక, ఆ తర్వాత పౌర సరఫరాల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష కొనసాగనుంది.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.. ధాన్యం సేకరణ, తాజా మిచౌంగ్ తుఫాన్ వల్ల తడిసిన ధాన్యం సమస్య తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించనున్నారు.
నేడు ఏపీకి కేంద్ర బృందం.. రెండు రోజుల పాటు పర్యటన
ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు రానుంది కేంద్ర బృందం.. ఈ రోజు, రేపు.. రెండు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.. తుఫాన్‌తో నష్టపోయిన పంటలను, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయనున్నారు.. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయడానికి ఈ రోజు రాష్ట్రానికి కేంద్ర బృందం రాబోతుందని.. నేడు కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ వెల్లడించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర బృందం.. ముందుగా ఈ రోజు ఇవాళ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టరుతో భేటీకానుంది.. ఇక, ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది సెంట్రల్ టీమ్.. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు బృందాలుగా పర్యటించనున్నారు కేంద్ర బృందంలోని అధికారులు.. క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు.. తుఫాన్‌తో జరిగిన నష్టంపై ఆయా జిల్లాల అధికారుల నుంచి సమాచారం సేకరించనుంది సెంట్రల్ టీమ్.
కోమటిరెడ్డికి అస్వస్థత… యశోదా హాస్పిటల్లో అడ్మిట్
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సమయంలో ఆయన గొంతు నొప్పి మొదలైందని విశ్వనీయ సమాచారం. అయితే.. గొంతునొప్పి ఇటీవల తీవ్రమవడం వల్ల సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. కోమటి రెడ్డికి వైద్యలు చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితిపై వైద్యులు క్లారిటీ ఇవ్వలేదు. ఈరోజు సాయంత్రం లోపల ఆయన ఆరోగ్యం పై వైద్యులు వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దేశ రాజధాని న్యూఢిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌ను కోరారు. గత సోమవారం ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు.
అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి..
అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజల జీవన స్థితిగతుల్లో వస్తున్న మార్పులు, జీవన ప్రమాణాల పెరుగుదలకు సూచికలు నమోదు చేయడంలో ప్రణాళిక శాఖ కీలకపాత్ర వహిస్తుందని భట్టి వివరించారు. ఈశాఖలో పనిచేసే అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారని తెలిపారు.. ప్రభుత్వ ఆలోచన సరళికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత సంక్షేమ రాజ్యాంగ తీర్చిదిద్దే ప్రణాళికలు మీ శాఖ నుంచే పుట్టుకు రావాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులకు ఉద్బోధించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో కలిసి ప్రణాళిక శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక శాఖ అధికారులు నిర్వహిస్తున్న విధులు, తయారు చేసే ప్రణాళికలు, సేకరించే గణాంకాల వివరాలను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి భట్టి విక్రమార్కకి వివరించారు.
దుబాయ్ పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ స్కామ్ నిందితుడు రవి ఉప్పల్
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పెద్ద విజయం సాధించింది. మంగళవారం నాడు ఇద్దరు ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే అతడిని భారత్‌కు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప్పల్ యాప్ సహ వ్యవస్థాపకుడు కూడా. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. దీని తరువాత దుబాయ్ పోలీసులు 43 ఏళ్ల ఉప్పల్‌ను అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఉప్పల్‌ను ఈడీ విచారిస్తోంది. ఇది కాకుండా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, ముంబై పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో ఉప్పల్‌తో పాటు మరో ప్రమోటర్‌పై దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీని తర్వాత, రెడ్ నోటీసు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను ఇడి అభ్యర్థించింది. ఉప్పల్ తన భారత పౌరసత్వాన్ని వదులుకోకుండా వనౌటు పాస్‌పోర్ట్ తీసుకున్నారని చార్జ్ షీట్‌లో ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. వనాటు ఒక ఖండాంతర దేశం. మహదేవ్ యాప్ కేసులో ఉప్పల్ అరెస్టును అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నేతలకు ప్రమోటర్లు రూ.500 కోట్లు లంచం ఇచ్చారని నిందితుల్లో ఒకరు ఆరోపించారు. నవంబర్ 2వ తేదీన రూ. 5 కోట్ల నగదుతో కొరియర్ అసీమ్ దాస్‌ను ఇడి అరెస్టు చేసింది. చంద్రకర్, ఉప్పల్ తరపున నగదు పంపినట్లు కొరియర్ అంగీకరించినట్లు ఏజెన్సీ పేర్కొంది.
నేడు పాట్నాలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. హాజరు కానున్న 600మంది ప్రముఖులు
రెండు రోజుల పాటు జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. డిసెంబరు 13, 14 తేదీల్లో పాట్నాలోని జ్ఞాన్ భవన్‌లో నిర్వహించే ఈ సమ్మిట్‌లో అదానీ, గోద్రెజ్, ఐటీసీ, ఐఓసీఎల్ సహా దేశవిదేశాల నుండి 600 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండో రోజు సదస్సుకు హాజరుకానున్నారు. మొదటి రోజు అనేక సెషన్స్ నిర్వహించబడతాయి. ఇందులో ఉప ముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్ యాదవ్, ఆర్థిక మంత్రి విజయ్ చౌదరి, ఇంధన శాఖ మంత్రి బిజేంద్ర యాదవ్, జలవనరుల శాఖ మంత్రి సంజయ్ ఝా, పరిశ్రమల శాఖ మంత్రి సమీర్ కుమార్ మహాసేత్, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు పాల్గొంటారు. సమ్మిట్ సందర్భంగా రూ.500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే 12 కంపెనీలతో విడివిడిగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. డిసెంబర్ 14న ముఖ్యమంత్రి ఎదుట వారితో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. ఇది కాకుండా రూ.500 కోట్ల లోపు పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు 240 ఉన్నాయి. ఇందులో రూ.100 నుంచి రూ.500 కోట్ల విలువైన కాంట్రాక్టులు కలిగిన కంపెనీలు 20, రూ.50 నుంచి రూ.100 కోట్ల విలువైన కాంట్రాక్టులు కలిగిన కంపెనీలు 15, రూ.50 కోట్ల లోపు కాంట్రాక్టులు కలిగిన కంపెనీలు ఉన్నాయి. అమెరికా, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, తైవాన్, మారిషస్, జర్మనీ, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్థాన్, నేపాల్, వియత్నాం, హంగేరీ, మడగాస్కర్, మలేషియా, యూఏఈ దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.
రింకూ సింగ్ పవర్‌ఫుల్ షాట్.. బాక్సులు బద్దలు! వీడియో వైరల్
ఐపీఎల్ స్టార్, టీమిండియా యువ ఆటగాడు రింకూ సింగ్ భారీ షాట్లతో అలరిస్తున్నాడు. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20ల సిరీస్‌లో చెలరేగిన రింకూ.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపైనూ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో టీ20లో రింకూ 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. రింకూ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్‌రమ్ వేసిన 19వ ఓవర్ చివరి బంతిని రింకూ సింగ్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ముందుకొచ్చి స్ట్రైట్‌గా షాట్ ఆడగా.. బంతి సైట్ స్క్రీన్‌పై ఉన్న మీడియా బాక్స్ గ్లాస్‌ను తాకింది. బంతి బలంగా తాకడంతో గ్లాస్ పగిలిపోయింది. ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పుడు వైరల్ అవుతోంది. వాట్ ఏ ప్లేయర్, వాట్ ఏ షాట్ అంటూ రింకూ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రింకూ అంతకుముందు బంతిని కూడా భారీ సిక్సర్‌గా మలిచాడు.
ఆ విషయంలో చాలా డిజప్పాయింట్ చేసావ్ లోకీ…
ఖైదీ సినిమాతో కోలీవుడ్ చూసిన సంచనలం లోకేష్ కనగరాజ్. ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో కూడా ఊహించని ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న లోకేష్, మూడో సినిమా విక్రమ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. నైట్ ఎఫెక్ట్ లో, రాత్రి జరిగే క్రైమ్ వరల్డ్ ని చూపిస్తూ… ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, సూపర్బ్ వింటేజ్ సాంగ్స్ తో కథని చెప్పే లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవలే లియో సినిమాతో కాస్త అప్సెట్ చేసాడు లోకేష్. దళపతి విజయ్ కి పాన్ ఇండియా హిట్ ఇస్తాడు అనుకుంటే లోకేష్, అన్ని వర్గాల ఆడియన్స్ ని కాస్త నిరాశపరిచాడు. ఈ విషయం కన్నా లోకేష్ ఇంకో విషయంలో ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసాడు. డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ ట్వీట్స్ తో విషెష్ చెప్తూ ఉన్నారు. లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ సినిమా రజినీకాంత్ తో అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి ఉంది. తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. “కోడ్ రెడ్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి రజినీకాంత్ బర్త్ డే రోజున కనీసం ఒక్క అనౌన్స్మెంట్ అయినా వస్తుందని తలైవర్ ఫ్యాన్స్ భావించారు. డే ఎండ్ అయ్యే వరకూ వెయిట్ చేసారు కానీ లోకేష్ నుంచి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక్క వార్త కూడా బయటకి రాలేదు. మరి న్యూ ఇయర్ కి అయినా తలైవర్ 171 గురించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. లోకేష్-రజినీ కలిసి ఒక బాషా రేంజ్ సినిమా చేస్తే చాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక్క రికార్డ్ కూడా మిగిలే అవకాశం లేదు.
పదేళ్ల తర్వాత ‘A’తో తిరిగి వస్తున్నాడు…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. జక్కన చెక్కిన ఎపిక్ వార్ డ్రామా బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రీజనల్ బ్యారియర్స్ ని బ్రేక్ చేసాడు ప్రభాస్. ముఖ్యంగా నార్త్ లో ప్రభాస్ సౌత్ నుంచి వెళ్లి వందల కోట్ల మార్కెట్ ని ఓపెన్ చేసిన హీరోగా మారాడు. రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి సౌత్ హీరోలు నార్త్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు కానీ ప్రభాస్ రేంజ్ మార్కెట్ నార్త్ లో ఏ ఇండియన్ హీరోకి లేదు. హిందీ బెల్ట్ లో ప్రభాస్ ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ చాలా మంది హీరోల హిట్ సినిమా కలెక్షన్స్ అంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి ప్రభాస్ గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్నాడు, సరైన హిట్ పడక సైలెంట్ గా ఉన్నాడు. ఈసారి బాకీ మొత్తం తీర్చేయడానికి ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్ సీజ్ ఫైర్’ సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రభాస్ ని మళ్లీ బాక్సాఫీస్ బాద్షాగా మార్చనున్నాడు. సలార్ సినిమా సెన్సార్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. A సర్టిఫికేట్ తో ప్రభాస్ బాక్సాఫీస్ పై దాడి చేయనున్నాడు. రెండు గంటల యాభై అయిదు నిమిషాల నిడివితో ప్రభాస్ దండయాత్ర చేయనున్నాడు. A రేటెడ్ ఫిల్మ్ గా రిలీజ్ అవుతుంది అంటే సలార్ సినిమాలో యాక్షన్ భారీగానే ఉంటుంది. బాహుబలి, సాహూ, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలకి A రేటెడ్ సర్టిఫికేట్ రాలేదు కానీ బాహుబలికి ముందు ప్రభాస్ చేసిన లాస్ట్ యాక్షన్ మూవీ మిర్చికి మాత్రం A సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాతో ప్రభాస్ మాస్ కి కొత్త అడ్రెస్ ఇచ్చాడు, ఇప్పుడు సలార్ లో కొత్త మాస్ ని ఏకంగా పాన్ ఇండియాకు పరిచయం చేయబోతున్నాడు. 2013లో మిర్చి రిలీజ్ అయ్యింది, 2023లో సలార్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మిర్చి తెలుగు సినిమా… ఇప్పుడు సలార్ ఇండియన్ సినిమా. ఈ పదేళ్లలో ప్రభాస్ గ్రాఫ్ ఎంత పెరిగిందో క్లియర్ గా కనిపిస్తుంది. మరి A రేటెడ్ సినిమాతో ప్రభాస్ పదేళ్ల తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
2023లో టాలీవుడ్ భారీగా టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాలు..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది సక్సెస్ రేటును అందుకున్న సినిమాల కన్నా ఫెయిల్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాలు ఎక్కువగా నెగిటివ్ టాక్ ను అందుకున్నాయి.. అధిక శాతం చిన్న సినిమాలే హిట్ అవ్వడం , పెద్ద సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ కుదేలు అయ్యింది.. ఏ హీరో సినిమాలు హిట్ అయ్యాయో, ఏ హీరో సినిమా ప్లాప్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 2023 ఏడాది ప్రారంభంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పెద్ద హిట్ అయ్యి దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. ఈ సినిమాతో పోటీకి వచ్చిన ‘వీర సింహా రెడ్డి’ కూడా 80 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి కొత్త ఏడాది హ్యాట్రిక్ హిట్స్ ను అందుకున్నాయి.. ఆ తర్వాత భారీ బడ్జెట్, భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు జనాలను అంతగా ఆకట్టుకోలేక పోయాయి..ప్రభాస్ ‘ఆదిపురుష్’ మరియు పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిత్రాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.. కానీ అవి రెండు నిరాశ పరిచాయి..