Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 30 01 2025

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Published Date :January 30, 2025 , 5:14 pm
By Gogikar Sai Krishna
  • అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్.. ఈ నంబర్‌ సేవ్‌ చేసుకోండి..!
  • కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయి
  • జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస
  • బడ్జెట్‌ను అడ్డుకోవడం అంటే.. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే!
  • ఇన్‌ప్లూయెన్స‌ర్లు జర పైలం.. ఇలా చేస్తే ఇక మీరు జైలుకే
Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయము!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఉద్దేశం డబ్బులు లేవని కాదని, అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని, మేయర్ పీఠం గెలుచుకుంటామని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ… ‘జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నాం. మేయర్ పీఠం గెలుచుకోవాలని ప్లానింగ్ చేశాం. కేంద్రం నుండి రూపాయి నిధులు ఇవ్వలేని ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ సమావేశంకి బీజేపీ వాళ్లు బిక్షాటన చేస్తూ రావడం విడ్డూరంగా ఉంది. కుల సర్వే జరిగితే బీఆర్ఎస్, బీజేపీలు తమకు నష్టం జరుగుతుందని అనేక కుట్రలు చేశాయి. ఫిబ్రవరి 5న ఉప సంఘం కేబినెట్ నివేదిక ఇస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కేబినెట్‌లో నిర్ణయిస్తారు’ అని చెప్పారు.

అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్.. ఈ నంబర్‌ సేవ్‌ చేసుకోండి..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక అడుగులు వేస్తోంది.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది.. ఏపీ ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చింది.. ప్రజలకు మొదటి దశలో 161 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి.. రెవెన్యూ, దేవాదాయ శాఖ, సీఎంఆర్ఎఫ్.. ఇలా మొత్తంగా “మన మిత్ర” ద్వారా 161 రకాల సేవలను పౌరులకు అందుబాటులో ఉంటాయని.. వాట్సాప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు.. రెండో దశలో 300 పైగా పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి.. ఇక ఏపీ ప్రభుత్వం దీనికోసం అధికారిక వాట్సప్ నంబర్ 95523 00009ను కేటాయించింది. దీని ద్వారా వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందించనుంది.. ఒకేముందు.. 95523 00009ను సేవ్‌ చేసుకోండి.. మీకు కావాల్సిన సేవను అందుకోండి..

అప్పుడు వచ్చిందే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన.. మంత్రి లోకేష్‌

తాను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు మంత్రి నారా లోకేష్.. “మన మిత్ర” పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్‌తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం అన్నారు. బటన్ నొక్కితే భోజనం.. సినిమా టికెట్లు వచ్చినపుడు పాలన ఎందుకు అందుబాటులోకి రాదు అనే ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు లోకేష్.. ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాంఅన్నారు.. మొదటి విడతలో 160కి పైగా పౌర సేవలు. రెండో విడతలో 300కి పైగా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు లోకేష్..

బడ్జెట్‌ను అడ్డుకోవడం అంటే.. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బడ్జెట్‌ను అడ్డుకోవడం అంటే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని హైదారాబాద్ ఇన్చార్జి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమే అని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నాయకత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో గత పది ఏళ్లలో లేని అభివృద్ది ఇప్పుడు జరుగుతుంటే ఈర్శగా ఉందా? అని మంత్రి పొన్నం విమర్శించారు.

సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నా.. ఆ ఒక్కటి తప్ప అన్ని కంట్రోల్‌లో ఉన్నాయి

తాను సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను అన్నారు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సీహెచ్ ద్వారకా తిరుమల రావు.. రేపు అనగా.. జనవరి 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఆయన విధులు నిర్వహించారు. ఇక, ఈ రోజు మీడియాతో మాట్లాడిన డీజీపీ ద్వారక తిరుమల రావు.. ఏడు నెలలుగా డీజీపీగా పని చేస్తున్నాను.. 35 ఏళ్లుగా పోలీస్ సేవలు సంతృప్తికరంగా అందించాను అనే తృప్తి ఉంది.. సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను అన్నారు.. ఏపీలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి.. సైబర్ క్రైమ్ తప్ప మిగతా వాటిలో నిందితులను గుర్తిస్తున్నాం.. సైబర్ క్రైమ్ తప్ప అన్నీ కంట్రోల్ లో ఉన్నాయని స్పష్టం చేశారు..

గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం!

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్‌కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లామని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయని, తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకి మంత్రి ధన్యవాదాలు చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి రూ.1.73 ల‌క్షల కోట్ల రూపాయిల పెట్టుబ‌డులు తీసుకొచ్చారు.

రాష్టానికి ఏమీ అడిగినా కేంద్రం సహకరిస్తుంది..

ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, వైసీపీ తరపున మిథున్ రెడ్డి, జనసేన తరపున బాలశౌరి హాజరయ్యారు. అటు.. కాంగ్రెస్ తరపున జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్ హాజరయ్యారు. అనివార్య కారణాలతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.ఆర్ సురేష్ రెడ్డి గైర్హాజరయ్యారు.

కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయి

నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది ? చేతిలో ఎర్రబుక్కు పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదు ? అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనుకకు వెళ్లే దుస్థితి ఏర్పడిందని, అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారన్నారు. అబద్దం అద్దం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి బొమ్మ కనబడుతుందని, గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్నారు ఎమ్మెల్స కవిత.

ఇన్‌ప్లూయెన్స‌ర్లు జర పైలం.. ఇలా చేస్తే ఇక మీరు జైలుకే

నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఉప్పెనలా పెరిగిపోతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఇన్‌ఫ్లుఎన్సర్లు వీటిని తెగ ప్రమోట్ చేస్తూ, అమాయక ప్రజలను మోసపూరితంగా ఆకర్షిస్తున్నారు. అయితే, ఇలాంటి యాప్స్‌ను ప్రచారం చేయడం భారతదేశ చట్టాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలై ఎంతో మంది తమ సంపదను కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోతున్నారు. కుటుంబ పోషణ కష్టమవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి, విడాకులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి , పేద కుటుంబాలకు బెట్టింగ్ మహమ్మారిలా మారింది.

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస

జీహెచ్‌ఎంసీ (GHMC) కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశం ఆరంభమైన కొద్దిసేపట్లోనే రసాభాసగా మారింది. మేయర్ ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించగా, దీనికి బీఆర్‌ఎస్ (BRS) , బీజేపీ (BJP) కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై కాకుండా, ప్రజా సమస్యలపై మొదట చర్చించాలనే డిమాండ్‌తో ఈ రెండు పార్టీల కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు.

బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు వెళ్లగా, కాంగ్రెస్ (Congress) కార్పొరేటర్లు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి (C.N. Reddy), బాబా ఫసియుద్దీన్ (Baba Fasiuddin) బీఆర్‌ఎస్ సభ్యుల నుండి ప్లకార్డులను లాక్కొని చించేశారు. దాంతో, రెండు పార్టీల మధ్య వాగ్వాదం ముదిరి తోపులాటకు దారి తీసింది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • cm chandrababu
  • GHMC Council
  • MLC Kavitha
  • telugu news

తాజావార్తలు

  • France-Iran: గల్ఫ్ దేశాలకు ఫ్రాన్స్ మద్దతు.. ఇరాన్‌‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన

  • Iran-Israel war: నెతన్యాహు కార్యాలయం ధ్వంసం.. ఇజ్రాయెల్ ప్రధానిపై ఇరాన్ సంచలన ప్రకటన

  • Israel-Iran war: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో ఇరాన్ మంత్రి, పెద్ద సంఖ్యలో నిఘా అధికారులు మృతి

  • Jallikattu Tragedy: జల్లికట్టులో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి, 76 మందికి పైగా తీవ్ర గాయాలు..

  • Tollywood: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్స్ ఎవరు?

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions